పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

ల్పించు ఈశ్వర ప్రేరిత మహాశక్తియే యనియు, ఈ యుద్యమ ప్రచారకులందరు తామీశ్వర ప్రేరితులమనియు, ఈశ్వరాదిష్టకృత్యములను తాము నెరవేర్చుచున్నామను దృఢతర భక్తి పూరితులుగ నున్నారనియును జెప్పవచ్చును.

ఏయుద్యమము సరియైన మార్గముల నవలంబించి అందుకు నిర్ణీతమగు పనిని నిర్వర్తించవలెనన్న ఆ యుద్యమావలంబకులకు అందలి ప్రాప్యముల స్వరూప స్వభావముల యొక్కయు, ఆ యుద్యమమునకును తోడి యుద్యమములకును గల యన్యోన్య సంబంధముల యొక్కయు జ్ఞానము దృఢముగ నుండి తీరవలయును. ప్రతియుద్యమమును అవయవ సమన్వితమై వృద్ధిక్షయములకు లోనై యుండును. ఆదర్శమే దీనికి ప్రాణము. ఆదర్శము లేని యుద్యమము ప్రాణము లేని యాకారము అట్టి యుద్యమములు వృద్ధిబొందవలెనన్న తమ యందు స్వాభావికముగానున్న జవసత్వముల వల్లగాక సతతము పరాపేక్షను బొందియుండును. పై నుండి వచ్చు సహాయ మెప్పుడు తగ్గునో ఆయుద్యమమప్పుడే భగ్నమైపోవును. అట్లుగాక ఆదర్శముతో గూడిన యుద్యమము ఈశ్వర నిర్మిత సావయవయవిక జీవివలె దినదినాభివృద్ధి గాంచును. ఆదర్శము యొక్క శక్తి మహత్తరము. ఆకాశము మెరయు శిరపంక్తిగల హిమవంతున బుట్టి భూభాగమున జొచ్చి తాబోవుదేశమునంతను సస్యశ్యామలముగను ఫలభరితముగను జేయు గంగాప్రవాహము బోలె ఆదర్శము ఫలప్రాప్తి నిబొందించును. ఆద్యర్శము నేకాగ్రచిత్తతతో ధ్యానము చేయుచుండిన కార్యాచరణయందు వచ్చిన కష్టములన్నియు సుఖములుగా పరిణమించి కార్యదీక్షను ప్రజ్వలింపజేయును. కావున గ్రంథాలయోద్యమము వృద్ధిజెంది అందువలన ఆఫలమంతయు సమకూడవలెనన్న అందలి విషయయములను తదవలంబకులు బాగుగ నెరుంగవలెను.

గ్రంథాలయోద్యమమునకు ప్రాప్యమే దేశమునందు జ్ఞానాభివృద్ధిని జేసి మనుజునియాత్ర పవిత్రముగను పురుషార్థప్రాప్తి పూర్వకముగను చేయుటయే ఈ యుద్యమము యోక్క ప్రాప్యము. ఈ ప్రాప్యమును దృక్పథమునందుంచుకొని ఈ యుద్యమము పేరజరగు ప్రతిపనియు ఈ ప్రాప్యమును కానుకులకముగ పరిణమింప జేయుటకు ఎట్లు సహకారి యగుచున్నది, ఎట్లు విరోధమును గలిగించుచున్నది యను యంశములను తర్కించు ఉద్యమప్రచారకులు కార్యాచరణను బూనవలయును. ఇక నీయుద్యమమునకును ఇతరయుద్యములకును గల సంబంధమును గూర్చియు, సంబంధమును దెలిసికొనవలసిన యావశ్యకతను గూర్చియు తెలుపవలసి యున్నది. జాతి యొక్క ఔన్నత్యము కొఱకనేక యుద్యమములు వెలువడి పనిజేయుచున్నవి. ఇందులో గొన్ని సంఘసంస్కరణ కొరకును, కొన్ని మతవ్యాపకము కొరకును, కొన్ని రాజకీయ సంస్కరణ కొరకును ప్రయత్నించుచున్న ఈ యుద్యమములన్నిటి యొక్క స్వభావము వ్యాప్తిని బాగుగ గుర్తెరిగి ఆ యుద్యమము యొక్క సిద్ధాంతములకు విరోధము లేకుండినట్లు గ్రంథాలయోద్యమము నెట్లు వ్యాపింప జేయవలయునో ఆ యుద్యమ ప్రచారకులు జాగ్రతతో విచారింపవలయును. సౌధమును నిర్మింప