XIII
ఉపోద్ఘాతము
ఈ కాలమున జనసామాన్యమునకు విద్యను గఱపుటయందు గ్రంథాలయములు మంచి నాధనములుగా ప్రసిద్ధి గాంచుచున్నవి. మన యాంధ్రదేశమున గడచిన పది పదునైదు సంవత్సరములనుండియు గ్రంథాలయోద్యమము ప్రారంభమై దినదినాభివృద్ధి గాంచినది. మన దేశమందీయుద్యమము నలుదెసల వ్యాపించి అందువలన చేకూరులాభమును పూర్తిగా మన దేశీయులకు అందవలెనన్న నీయుద్యమమెక్కువ సమర్ధతలో జయప్రదముగ నిర్వహింపబడుచు దేశాంతరముల యందును ఖండాంతరములయందరు ఏయేమార్గముల నవలంబించి యభివృద్ధి గాంచుచున్నదో మనము బాగుగ గమనించి మనదేశము యొక్క స్థితిగతులనుబట్టి ఆయా మార్గముల దీని నెట్లు నడప వలయునో నిర్ణయించుకొనవలసి యున్నది. ఈ కాలమున గ్రంథాలయములు అమెరికా ఖండమున మిక్కిలి ప్రసిద్ధి గాంచియున్నవి. ఆదేశమున గ్రంథ భాండాగారిపదము నధిష్ఠించగోరువారు పట్టపరీక్షయందుత్తీర్ణులైన పిదప మూడు సంవత్సరములకాలమీ శాస్త్రమును ప్రత్యేక మభ్యసింపవలెను. ఈవిషయముల వలన నీయుద్యమ సంబంధమగు వాఙ్మయమెంత విపులముగ వ్యాప్తిజెందినది మనమూహింపవచ్చును. మన దేశమున నీయుద్యమము బాల్యావస్థయందుండుటచే నిందును గూర్చిన గ్రంథము లేవియు లేవు. ప్రత్యేక మీవిషయమును గూర్చి పరిశ్రమజేసిన వారలచే గ్రంథాలయోద్యమము యొక్క వివిధాంశములపై వ్యాసముల ువ్రాయించి దేశమందు వ్యాపింపజేయవలసి యున్నది. మనదేశమందు ఇతర దేశములయందు ఉన్న గ్రంథాలయముల యొక్క చరిత్రలు తెలిపికొనవలసియున్నది. ఈవిషయములనన్నిటినిగూర్చి చర్చించుటకు “గ్రంథాలయసర్వస్వమ”ను పేరుతో గ్రంథమాల నొకదానిని ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘపక్షమున మూడు మాసముల కొకమాఱు ప్రచురించుటకు తీర్మానింపబడినది. గ్రంథాలయోద్యమము గ్రంథములనుగూర్చిన దగుటచేతను గ్రంథములు వాఙ్మయాత్మకములగుట చేతను ఈ యాభివృద్ధిని గూర్చినట్టియు, చరిత్ర, పరిశోధనలను గూర్చినట్టియు వ్యాసము లిందు ప్రచురింపబడును. ఈనాటి గ్రంథాలయములు ప్రత్యేక గ్రంధ సమూహము లేక మనుజుని యొక్క పంచేంద్రియముల మూలకముగను మరుజుని మనుష్యత్వమును వ్యక్తీకరింపజేయు సాధనముల సమర్చున్దవై యుండుటచే చిత్రకళల యభివృద్ధిని గూర్చిన వ్యాసములుకూడ నిందు ప్రకటింపబడును. ఆంధ్రదేశాభిమానులును, ఆంధ్రభాషాభిమానులును ఇందు ప్రచురించుటకు వ్యాసములను బంపియ గ్రంథమాల యభివృద్ధి నొందుటకు ప్రోత్సాహపరచియు నీయుద్యమమును జయప్రదమునొనరింప బార్థితులు.