77
మనుచరిత్ర నాయికలు
వరూధిని
ఆహో ! రసదేవతా ! నీ తారుణ్యము నారాధించిన సహృదయులు ధన్యులు. మహాకవి పెద్ద నార్యుని నీ వెఱుం గుదువు. ఆరౌచికుని కావ్యపుత్రికయు నిను సేవించిన దే; కాని కాల మనేక గతుల భ్రమించినది. ఆమహాకవి నివ సించిన నగరము పాడయినది. విద్యానగరనాగరకతీయం దలి నానాగుణవికాసముల నిపుడు చర్చించుచున్నారు. అమృతాంశుఁడగు చంద్రుని కిరణగుచ్ఛము లేనగరీమతల్లి యందములను బాలించినవో, అచట నిపుడు పొడుపడిన దిబ్బలపై వ్రాలి మాసిపోవుచున్నవి. మనుచరిత్ర నాయి కల నుజ్జీవింపఁజేసిన మనోహరవ్యక్తు లేమయిపోయినవో? పోయినవి. వారిబింబములు రసికులగు ఆంధ్రులహృదయ ఫలకములపై నున్నవి. ఏ సెలయేటి కలకలములలోనో వారి స్మృతిగీతికలు వినవచ్చుచునేయున్నవి. ఇంక స్థూ లరూపప్రసక్తి యెందుకు ? భావనయందుఁ ప్రతిబింబిం చు నాయికాస్వరూపమును విమర్శింతము. లు చరిత్ర. వరూధుని పుట్టిల్లు 'సుధాబ్ధి'. చంద్రుని చెల్లెలగు ల క్ష్మీదేవి 'తోఁబుట్టువు'. దేశము 'కనక నగ' ప్రాంతము. 'రాలుగరఁగించు గాంధర్వము' విద్య. మన్మధశాస్త్రాధ్య యనము ' వెన్న తిన్న నాటినుండియుఁ జేసినది. 'సవనతం త్రములు' ఓలి పెట్టించుకొన్న లాంఛనములు. రచ్చపట్టు కల్పవృక్షచ్ఛాయలక్రింది మరకతమణీ వేదికలు. వై కుంఠ కైలాసములు ఆమెకు నాట్యసభలు. ఇదియంత యు వరూధిని స్వయముగాఁ జెప్పినదే! ప్రవరాఖ్య సంద ర్శనాసమయమందే కవి యీనాయికా పూర్వవృత్తము ను జిత్రించియున్నాడు. నాయిక అపుడు 'అబ్బురపొ టు' లో నున్నది. కాని యింకను 'రయోద్ధతి' కి వశు రాలగు ఉత్కంఠ దీపింపలేదు. ఈ లోపల ఎవ్వ కెవీవ' ను 'భూసుర కౌతవరుసుమ శరాసనునకు బదులు చెప్పిన " ది. వరూధిని వాక్యములయం దివి ప్రధమములు కావు. ఇంతంత కన్నులుండఁగా తెరువెవ్వరి వేడెదవను' తొలిసారి మాటలయందు కేవల నర్మ్యప్రాగల్భ్యము సూచింపఁబడి నది; ‘భయములేదా' యను సుకుమారప్రౌఢిమ కొంతత రువాత తోపకపోదు, కాని ఎల్లిద మైతిమి మాటలేటి కీజ్' అను చివరనుడువులయందే వరూధు నీ స్వభావమున కుఁ గవి బీజబిందువులు వేసినాఁడు. ఈనాయికా ప్రధ మసంభాషణమునుబట్టి కొన్ని నైజవిలక్షణములు విమర్శ కుఁ డూహింపక పోఁడు; ఈ పె మితభాషిణి; కా ని ప్రొసూక్తి యెఱుఁగనిది కాదు. సరళధోరణి కలదు; కాని దేవ దేవీ మేనకల వలె ధారాళ వాచాలత లేదు. నిశితశిక్షాలబ్ధమయిన నాతి ప్రౌఢి మ యెంతయో రుచించుచున్నది; అయితే ఆ జన్మ సిద్ధమగు ధోరణీ చాతుర్యము ఉలూచీనాయి కాదుల యందుంబలె స్ఫురింపదు. వరూధిని స్వభావసిద్ధమయిన సరళనాయిక; అందువలననే భావమును కనువయిన భావ పూవున కనురూపమయిన తొడిమవలె నొప్పులోదవు చుండును. అవస్థలనుబట్టి యాలాపములు మాఱుట ప్ర కృతి సిద్ధము. వరూధునియందు ఛాయలు మాఱును గా ని శైలి సంపూర్ణమగు మార్పును బొందుట గావరాదు. ప్రవరాఖ్యుడు 'పొమ్మంచు ద్రోసిన' సందర్భమును బరి శీలింపుఁడు. ఆబిడ యాశాపతనమువలెనే యామె మా టల మధురిమయును భిన్న మైపోయినది. అపుడు 'కోప మునఁ జూచి 'నదఁట. 'క్రేఁటుగొనుచు' బలికినదఁట. ఆ వస్థలయందెంత తెచ్చుకోలు కోపమున్నను, సహజ సర ళమయిన వాణియం దాపరిణామము వచ్చినదికాదు. క లస్వనములో నేడ్చుచు ఆబ్రాహ్మణుని దిట్టిన తిట్లన్ని యు నాలకింపుఁడు. ఈరహస్యము గోచరింపఁగలదు. వరూధిని ప్రవరాఖ్యుని దూఱు భాగమును సత్యభామ శ్రీ కృష్ణుని దూఱుభాగముతోఁ గలిసి చదువుఁడు. వరూధి ని ప్రవరాఖ్యుని 'భూసురవర్య' యని సంబోధించినది. సత్య (పసులకాపరి, (వల్లవీకింకర' యని తృణీకరించినది. సత్యా తిరస్కారమునకుఁ జిర పరిచయపారమ్యము నొక