75
దు. “సర్వజనసంహారము జరిగి పృథ్వియంతయు శోకమ
యమై ఉత్తమ స్త్రీల సీమంతము తీసి వేయబడినప్పుడు
..." అను సర్ధముగల శ్లోకము
కము * కూడ సీమంతము పో
వుట వైధవ్యము యొక్క ముఖ్యలక్షణమని స్పష్టముగా
జాటుచున్నది.
మర్యాదగల పురుషులు వెంట్రుకలను ముడి వేసి
కొనుచు బయటికి వచ్చినపుడు తలగుడ్డ పెట్టుకొనుచు
నుండిరి. ఈతలగుడ్డ పద్ధతి హిందువులు స్వయముగా నే
ర్పఱచుకొనినదేకాని ఇతరులను జూచి నేర్చుకొనినదికా
దని తోఁచుచున్నది. ఇప్పటివలెనే ఆకాలమునందును
వారు ధరించు తలగుడ్డ యొక పొడుగుపాటి వస్త్రము.
దీనిని వారు తలచుట్టును వివిధములుగాఁ జుట్టుకొను చుం
డిరి. యుద్ధరంగమునకుఁ బోవు సమయమున భీష్ముఁడు
'తెల్ల తలకుమాలును ధరించినట్లు చెప్పఁబడి యున్నది.
ద్రోణుని విషయమునఁగూడ నట్టి వణనయే కలదు. క
నుక వయసుమీరినవారి శిరోవేష్టము సాధారణముగా
తెల్లరంగుది గాను యౌవనుల తలగుడ్డ యెర్రఁగానో లేక
ఏదయిన మరియొక రంగుదిగానో యుండవలెను.
దువుల తలగుడ్డలు గ్రీకులకు విచిత్రముగఁ గాన్పించినట్లు
తోఁచుచున్నది. కనుకనే ఏరియను' గ్రంధకారుఁడు
'ఇండికా' యను గ్రంధమున నిట్లు వచించియున్నాఁడు.
"హిందువులు దూదితోఁ జేయబడిన యొక వస్త్రమును
గట్టుకొనెదరు. అది మోకాళ్ళకును చీలమండలకును మ
ధ్యభాగమువఱ కుండును. ఇదిగాక వేఱకవస్త్రమును
పయిన వేసికొందురు. దీనిలో కొంతభాగమును వారు భు
జములపయినఁ గప్పికొని తక్కిన భాగమును తమ తలకుఁ
జుట్టుకొ నెదరు”.+ “ఏరియను చెప్పినట్లు ఒక సేవ స్త్రము
ను తలకుఁ జుట్టుకొనుటకును శరీరమును గప్పికొనుటకు
గూడ వాడుకొనువారు బహుళః బీదవారయి యుండవ
లెను. గొప్పవారి తలగుడ్డ ప్రత్యేక వస్త్రమై యుండవ
చ్చును. 'కటికాయను రూఫను' అను గ్రంథకారుఁడు
హిందూ దేశమును హిందువులను వణి౯ంచుచు “వీరు త
మ శరీరమును పాదములవఱకు మృదువయిన సన్నని వ
స్త్రములతో నాచ్ఛాదించుకొ నెదరు. పాదుకలు తోడి
గెదరు ; దూదితోఁ జేయఁబడినబట్టను తలకు ఁజుట్టికొం
దురు." ఆ అని చెప్పియున్నాఁడు. అయినను అప్పటి
తలగుడ్డ ఇప్పటికాలమున మనదేశమందలి కొన్ని ప్రాం
తములలోనున్నంత చిక్కులు కలదిగాను పొడుగుగాను
ఉండలేదని తోచుచున్నది. దానిని జుట్టుకొను పద్ధతి
హుశః ఇప్పుడు ఉ త్తర హిందూస్థానములోని పేదవాం
డ్ర పద్ధతివంటి దై యుండవచ్చును. ప్రతివాఁడును తన
తలగుడ్డను తానే చుట్టుకొనుచుండెను. రాజులు మాత్ర
ము కిరీటముల ధరించుచుండిరి. దుర్యోధనుఁడు భీముని
తోఁజేసిన తుది ద్వంద్వయుద్ధసమయమున కిరీటము అత
ని తలపైనుండెను. భగ్నోరుఁడై నేలఁబడిన పిమ్మట
నాతని తల పయిన నది యట్లే నిలచియుండెను. కావున
నే భీముఁడు దాని కాలితోఁ దన్నఁగలిగెను.
మున కిరీటము శిరమునకు గట్టిగా బిగింపఁబడుచుండెనని
యు బంధముల వదలించిన నేకాని వీడిరాకుండ నుండెన
నియు మనమూహింపవచ్చును.
హిందువుల వస్త్రములు తఱచుగా దూదితో "నేయ బడుచుండెడివి. ఆకాలమున హిందూదేశమున తప్ప మ అచ్చటను ప్రత్తి పండుచుండుటలేదు. ఈజిప్టులోగాని టర్కీలో గాని యది పఁడుచుండునట్లు కానరాదు. ఆ ట్లు కాదేని “హిందువులు చెట్లపైనఁ బందు ఉన్ని జేయఁబడిన వస్త్రములను ధరింతురు” అని గ్రీకులు నియుండరు. ధనవంతులు అందు ముఖ్యము గా పట్టుబట్టలు ధరించుచుండిరి. X రాజాంతిః పురములలోని స్త్రీలు “తకాళేయ వాసినులు" గా వర్ణింపఁబడి యు న్నారు. పురుషులుకూడ పసుపుపచ్చని బట్టలు ధరించుచుం డినట్లు కానవచ్చుచున్నది. మనదేశములోని కాశ్మీరము,
శ్లో॥ సంహారేనర్వతోజాతే వృధివ్యాం శోకసంభవే ॥ బహూ నాముత్తమ స్త్రీణాం సీమంతో ద్ధర వేతధాః కల్య" ఆ౧l _౨౦ A
- Ancient India. Magasthanes and Arrian by Mac Crindle P. 219.
¶ Invasion of India by Abxander. Mac Crindle P. 188. X సువద్ర మొట్టమొదట వచ్చి గోపాలిక వేషమున (పదతోఁ గలసికొనినప్పుడు ఆమె ఎర్రని పట్టుపుట్టమను ధరించియుండెను. శ్లో॥ సుద్రాంత్వర మాణాన్చి రక్తకౌశీయవాన్ పార్టీ ప్రస్తావయామాన కృత్పి గోపాలశావపు ఆది। ఆ౧౧డ