ముసుకు హింద్వార్య స్త్రీల యుత్తరీయమువంటిదే యని
వేఱుగాఁ జెప్పఁబని లేదు. “హోమరుకాలపు స్త్రీ దుః
ఖసమయములందును, స్వతంత్రముగా నేదయిన పని చే
యవలసివచ్చినప్పుడును, ముసుకును తీసివేయుచుండెడిది”
సీత తన్ను పరుఁడొకఁడు బలాత్కారముగా చెఱఁగొని
పోవునపుడు ఆసమాచారము భతం కెఱుకపఱచు ను దేశ
నుద్దేశముతోఁ దన యుత్తరీయమును వానరసేనాపరీవృతుఁడ
గు సుగ్రీవుఁడుండిన ఋష్యమూకము పైనఁ బడపై చెను,
కనుక హింద్వార్య స్త్రీయును హోమరు నాఁటి స్త్రీయును
ఉత్తరీయము నొక్కొకమారు వదలి వేయుచుఁగూడ నుం
డిరి. హిందూ స్త్రీవలెనే హోమరుని స్త్రీకిఁగూడ కం
చుక ముండ లేదను సంగతి హోమరు వణ౯ నముల వలన
నేమి పురాతన గ్రీకుల విగ్రహములవలన నేమి మనకుఁ దెలి
యుచున్నది.
దక్షిణహింమాస్థానమున నిప్పుడు వాడుక యందున్న
గోచీ పెట్టుకొను పద్దతి ఆకాలమున లేదని తోఁచుచున్న
ది. గోచీ పెట్టుకొను నాచారము స్త్రీలలో నా కాలము
న నుండినయెడల ద్రౌపది కట్టు పుట్టము దుశ్శాసనుఁ డ
టు ఊడఁ గుంజుటకు వీలు లేకయుండును. మహాభారత
మునం దెచ్చటను నీ గోచీమాట రానేలేదు. బాలురకు
ఉపనయన సమయమున కౌపీనము పెట్టించు పద్ధతి ననుస
రించియే స్త్రీలలో నిట్టి యాచారమారంభమై యుండవ
చ్చును. పురుషులకు ఉపనయనమెట్టిదో స్త్రీలకు వివా
హమట్టిదగుట చేత నే కాఁబోలు వివాహితలయిన స్త్రీ
లవిషయమున మాత్రమే గోచీపద్ధతి విధింపఁబడియున్న
ది. దక్షిణ హిందూస్థానమందు సయితము కన్యలు గోచీ
లేకుండ నే బట్టగట్టుకొనుచున్నారు. క్షాత్రయుగమున ను
త్తరీయమును గౌరవనీయురాండ్రు మాత్రమే ధరించు
చుండిరి. కావుననే ద్రౌపది సైరంధ్రి వేషముతో విరా
టునిపురమున నుండినపుడు ఏకవస్త్రగానే సుధేష్ణ యొద్ద
కు వచ్చినది. X బహిష్టులుగా నున్నప్పుడుకూడ స్త్రీ
లకు ఉత్తరీయముతోఁ బని లేకయుండెను. ఇంట గృహకృత్యములను నెరవేర్చు వేళ సయితము వారు తరీయము
ను వేసికొనకుండిరి. వితంతువులాకాలమునఁ దెల్లని యు
త్తరీయముల ధరించుచుండిరి. అరణ్యముననుండిన ధృత
రాష్ట్రుని దర్శించుటకై అతని కుటుంబములో నివారగు
వితంతువులు పాండవుల రాణివాసముతోఁబోయినప్పుడు
వారు తెల్లని యుత్తరీయములను ధరించి యుండిరని చె
ప్పఁబడియున్నది. * దీనిఁబట్టి యాలోచింపఁగా, తెల్ల
నియు తరీయము వితంతువులకొఱకు మాత్రము విధింపఁ
బడి యుండెననియు తదితర స్త్రీజనము ఎఱుపు నలుపు
మొదలగు రంగుల యుత్తరీయములను వేసికొనుచుండిర
నియు తేలుచున్నది. ఇప్పటి కాలమున వితంతువుల వ
స్త్రములు ఎఱ్ఱఁ గానుండిన మంచిదని తలఁ చుచున్నారు.
ఇది ప్రాయశః బౌద్ధ భిక్షునుల పద్ధతి ననుసరించి వచ్చిన
యాచారమై యుండవచ్చును. వివాహితలగు స్త్రీలు క
ట్టుకొను బట్టలుకూడ వేఱు వేఱు రంగులు కలవిగా, నుం
డవచ్చును. కట్టికొనువస్త్రములును ఉత్తరీయములును
ఇప్పటి కాలము వానివలెనే అంచులుకలపై యుండెనని
తోఁచెడిని.
ఇంక శిరో వేష్టములను గురించి విచారింతము. ఆకా లమునను స్త్రీలకు శిరో వేస్టము లుండినట్లు కానరాదు. వారి తలలకు టోపీకాని మదయిన నాచ్ఛాదనము గా ని యుండలేదు. ¶ వితంతువులు తెల్లని వస్త్రములను గుఱించి వెనుక నుల్లేఖింపబడిన శ్లోకపు మొదటి చరణ ము ఏతాస్తుసీమంతశిరోరుహాయ్యాః' అనునది. ఇది చతు ర్ధరుని గ్రంథమునందలి పాఠము. అతఁడు దీనికి బదులు గా (ఏతా స్త్వసీమంతశిరోరుహాయాః' అని యుండిన నింతకంటె బాగుండునని వ్రాసియున్నాఁడు. పాపటను చూణముతో నలంకరించుటకై వెంట్రుకలను రెండు పాయలుగాఁ దీని తలముడుచుటకు (సీమంత' మని పేరు. ముత్తయిదువులగు స్త్రీలు మాత్రమే ఈవిధముగా తలల ముడిచికొనుచుండిరి. కనుక వితంతువులను ఇట్టి యలంక రణము లేనివారినిగా వణించుట సహజము. ఇంతేకా x వాసశ్చ పరిధాయైకం కృష్ణా సుమలినంమహత్ | విరాట | F ౨
- శుక్లోత్తరీయాం నరరాజపత్న్యః ఆశ్రమః ౨౫ ౧_
¶ బయటకు వెడలినప్పుడు మాత్రము వారు తలలపై నుత్తరీయమును గప్పికొనుచుండివనుట నిశ్చయము,