పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/103

ఈ పుటను అచ్చుదిద్దలేదు

73


వెనుకఁ జెప్పఁబడియున్న రెండు వస్త్రములు తప్ప, అధమపక్షము క్షాత్రయుగారంభమున, హింద్వార్యులు మ ఱయుడుపులను ధరించియుండినవారు కారు లాగు లు జాకెట్లు ఎట్టివో వారెఱుఁగరు, కోట్లు చొక్కాలు వారికిఁ దెలియవు. బట్టలకు గ త్తిరించి తీరుతీరు ఉడు పులుగా గుట్టుట ఆకాలమున లేదు. కుట్టుపని మొట్ట మొదట బహుశః * 'సెమిటిక్కు'లలో ఁబుట్టినదై యుం డవచ్చును. అది గ్రీకులు పంజాబు దేశమును జయించిన కాలముననో, అంతకుఁ బూర్వము హింద్వార్యులకు పా రసీకులతో సంబంధము కలిగినట్టి డెరయసు పరిపాలన కాలముననో మనదేశమునఁ బ్రవేశించి యుండవచ్చును. రామాయణమున + కుట్టుపనివాఁడు వచ్చియున్నాఁడు. కాని మహాభారతమున వానిజాడ ఎచ్చటను కానరాదు. ఇంతమాత్రమున మహాభారతము రచింపఁబడిన కాలమున కుట్టుపనివాఁడు ఉండ నేలేదను అభావవాదమున కవకాశము లేదు. అది యటుండనిండు. మొత్తముమీఁద క్షాత్రయుగారంభమున హింద్వార్యులలో పురుషులు రెండు వస్త్రములలో నొకదానిఁ గట్టికొని రెండవదానిఁ గప్పుకొనుచుండిరని విశ్వసించుటయందభ్యంతర మేమి యును లేదు.

ఆకాలపు స్త్రీలు సైతము రెండు వస్త్రములనే ధరిం చుచుండిరని తోఁచుచున్నది. అయినను వీరివస్త్రము లు పురుషుల వస్త్రములకంటే నెక్కువ పొడవుగా నుం డెడివి. కట్టుకొనఁబడు వస్త్రము శరీరోర్ధ్వభాగమును గూడ_అనఁగా భుజములవఱకు గప్పియుంచుచుండె ను. చేతులను మాత్రము దానితో కప్పుకొనక విడిగా నుంచుచుండిరి. గుజరాతు, బంగాళము, మద్రాసు, ద క్కనులలోని _స్త్రీలు నేఁటికిని అట్లే తమ చీరెలఁ గట్టు కొనుచున్నారు. ఉత్తరీయము తలపైనఁ గప్పుకొనుచు సమయమువచ్చినపుడు దానిని మునుకుగా వేసుకొనుచుం డిరి. ఉత్తరహిందూస్థానమం దిప్పటికిని స్త్రీలు ఉత్తరీ యమును విధిగా ధరించుచుందురు. దక్షిణహిందూ దేశ

ఇది ఏచ్య - ౦డముయొక్క పశ్చిమభాగమున నుండిన యొక జాతి, i తున్న వాయి 73 మండు ఇప్పుడు వాడుకలోనున్న చీరెలు పొడవుగానుం డుటవలన వేస్తే యుత్తరీయము అనవసరమయినది. ఉ త్తర హిందూస్థానమున ఇప్పటివలెనే పూర్వమునఁ గూడ స్త్రీలు బయటికిఁబోవునపుడు మాత్రమే యుత్తరీయము ను ధరించుచుండిరి.

ద్రౌపదిని అంతఃపురమునుండి బలాత్కారముగా కా రవసభకు ఈడ్చుకొనివచ్చిన సందర్భమును వర్ణించుచు మహాభారతమున వ్రాయఁబడిన సంగతులు పైయభిప్రా యమును బలపఱచుచున్నవి. సభాంగణమున నామె పలుమాఱు ఁ నేను ఏకవస్త్రను' 'ఏకవస్త్రను' అని లిపుట్టునట్లు మొఱ పెట్టుకొనెను. దుర్యోధను నాజాను సారము ఆయేకవస్త్రమును గూడ వదల్ప యత్నించిరి. ఈ సంగతులను విచారించి చూచితిమేని ఆకాలమున స్త్రీలు కట్టుకొను వస్త్రము నులభముగా నూడివచ్చునట్లు ధ రింపఁబడు చుం డెననియు, మొలనూలువంటి దేదియు నుం డలేదనియు, ఇప్పుడు ఉత్తరహిందూస్థానమునందు డుకలోనున్న లంగావంటిదానిని వారు తొడుగుకొను చుండలేదనియు తేలుచున్నది. లంగావంటి వస్త్రమే యెనయెడల నంత యవలీలగా నూడియుండునా ? ఆకా లమున రవిక యనఁబడునదికూడ నుండలేదని తోఁచు చున్నది.

ఈ సందర్భమున నొక చిత్రము చూడఁదగి యున్నది. పురాతన కాలపు గ్రీకు స్త్రీ పురుషులు ధరించుచుండిన యుడుపులను హోరు వణి౯ంచి యున్నాఁడు. అవి మన హింద్వార్యుల వస్త్రము లను బోలి బోలి యున్నవి. హోమరు కాలపు స్త్రీ ము నుగాక "ఎక్కువ పొడవు తక్కువ వెడల్పుగలట్టిది యు దేశములో నే తయారయినట్టిదియు కత్తిరింపు గాని కుట్టుపని గాని లేనట్టిదియు నగు నొక వస్త్రమును గట్టు కొనుచుండెను; ఆ వస్త్రము భుజముపైన నొక సూదితో ను నడుముచుట్టు మొలనూలుతోను బిగింపఁబడుచుండె

చేతులు బయట నే యుండుచు వచ్చెను". పురు

షులకు మొలనూలు ఉండలేదు. పైన సుల్లేఖింపఁబడిన

అభావవాదమనఁగా, ఒక గ్రంధమున ఒకానొక వస్తువు ప్రసక్తి లేదు కనుక ఆగ్రంధము రచించఁబడిన కాలమున అష్టవస్తువే యుండ లేదని వాదించుట. fl Women of Homer by Walter Capt. Perry.