పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/100

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథభాండాగార సంఘములు.

అమెరికా దేశము.

అమెరికాదేశ గ్రంధ భాండాగార సంఘము. “ఫి లడెల్ ఫియా” యను పట్టణమున 1876వ సంవత్సరము న ప్రసిద్ధీకులగు భాండాగారాధిపులచే సమకూర్పబడిన ది. ప్రధమవత్సరము నందా సంఘమున 108 మందిమాత్రము సభ్యులు గానుండిరి; ఇపుడా సంఖ్య 1900 వరకు బెరిగినది. ప్రాధమిక దశయందా సంఘము యొక్క వృత్తాంతములన్ని యు ఁగ్రంధభాండా గారపత్రిక' యందు బ్రకటింపబడు చుండెను. 1907 సం॥ నందు ఆసంఘమువారు ప్రత్యేక మొకపత్రికను బ్రకటింప నారంభించిరి. గ్రంధాలయ ప్ర యోజనముల నాలోచించుటయు, పరస్పరము అభిప్రా యములను అనుభవములను వెల్లడించుకొనుటయు, గ్రం ధాలయముల కొరకు ఉపయోగించుచున్న శ్రమను ద్రవ్య మును ఎక్కువయుపయోగ కరముగ వినియోగించు నటు ల జేయుటయు పుస్తకశాలాధిపత్యమును వృత్తిగ నభివృ ద్ధిజేయుటయు, ఆసంఘము యొక్క ముఖ్యవిధులై యు న్నవి. ప్రత్యేక మొక వ్యక్తివలన కాజాలని సంస్కరణ ములను అభివృద్ధులను సంఘముగా జేరుటవలన గలిగెడు బలమువలన సాధించుటయు, అందరును కలసి పనిజేయు టవలన గ్రంధాలయమునకు వినియోగమగు శ్రమను ద్ర వ్యమును తగ్గించుటయు, కష్టవిషయములను తీర్మానిం చుటకుగాను వివిధశోధనలను అనుభవములను పొల్చుకో ని చర్చించుటయు, సభలమూలమునను, ఉత్తరప్రత్యుత్త రముల మూలమునను పరిచయమును స్నేహభావమును అ భివృద్ధి జేసికొనుటయుగూడ ఈ సంఘము యొక్క అభిప్రా యములై యున్నవి.

ఈప్రకారము, సార్వజనిక గ్రంధాలయము విద్యా విధానమునందు ప్రాధాన్య భాగముగ వికసించి పెంపొం దుటకు వలయు అనుభవ వేద్యములగు మార్గములనన్ని టీని ఈసంఘము వెదకు చుండును. కొన్ని స్థలములయందు సాంఘికులప్రత్యేక ప్రయత్నములవలనను, మణికొన్ని స్థల ములయందు కొందరుకూడి ప్రయత్నించుటవలనను, గ్రంధాలయములను స్థాపిం స్థాపించుటకు గాని అభివృద్ధి జేయుటకు గాని ఈసంఘము పాటుబడుచుండును. తద్వారా ఉ త్తమంబగు విద్య సర్వజనులకును సులభసాధ్యమగునటు* లజేయును. పుస్తకశాలాధికారులును, గ్రంధాలయోద్య మమునందు అభిమానముగలవారందరును ఈ సంఘమునందు జేరవచ్చును.

అమెరికా దేశ గ్రంధభాండా గార సంఘముయొక్క స్థా పన మనేక దేశముల యొక్క దృష్టి నాకర్షించినది. దుమీద ఇంగ్లాండు దేశమునకు రాజధాని నగరంబగు (లం డను' నందు 1879వ సంవత్సరమున 'ఆమెరికా' ' 'ఇంగ్లాం డు' దేశముల పుస్తకశాలాధికారులందరును గలసి సమా వేళమై “సంయుక్త రాష్ట్ర భాండాగార సంఘము”ను ఏర్పాటు గావించిరి.

మఱియు అమెరికాఖండమునందు 'రాజధాని సం ఘములు'ను గలవు. 'అమెరికా దేశ గ్రంధభాండాగార సంఘము' దేశమునంతకును ఎట్టిలాభమును జేకూర్చు చు న్నదియో, యట్టిలాభమునే “రాజధాని సంఘములు” త మతమ - రాజథానులకు జేయుచున్నవి. కుగ్రామముల యందున్న గ్రంధశాలాధికారులు 'అమెరికాదేశ గ్రంధ భాండాగార సంఘము' యొక్క సభలకుబోవుట దుస్సా ధ్యము గానుండును. కాబట్టి అట్టివారు “ రాజధాని సంఘ ము”యొక్క సభలకు బోయెదరు. ఇట్టిరాజథాని సంఘ ములా దేశమున ముప్పదియారు గలవు.

చదువరులారా? ఇంతటితో ఇట్టి సంఘములకు మితియుండునని మీరు తలంచితిరేని అట్టియూహ సత్య మునకు దూరమైయుండును. ఒక్క పట్టణమునందుం డు వివిధ గ్రంథభాండాగారములవారు గాని, చుట్టుప్రక్క లనుండు గ్రామముల గ్రంధభాండాగారములు గాని, కూ డి గ్రంధభాండాగార సమాజముల నేర్పరచు కొనెదరు. ఈ సమాజములవలన వివిధ భాండాగారములవారు పరస్ప రపరిచయము నభివృద్ధి జేసికొని తమకు సంబంధించిన విమ యములను గూర్చి చర్చించుకొనెదరు. మఱియు విద్యాధి కులను రప్పించి వారి యుపన్యాసములను వినెదరు. ఇట్ల సమాజములలో కొన్ని గ్రంధవిషయ విభజనమునందును