పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/14

ఈ పుటను అచ్చుదిద్దలేదు

92 గ్రంథాలయ సర్వస్వము

దిచిన్న భాండాగారమనియు చెప్పకాదు విషయమునుగూర్చి తనకు డెలియకున్నను ఆపుస్తకము తనభాండాగారమునందు లేకున్న ను తనగ్రామమునకు దగ్గనున్న పట్టణము లోని భాండాగారములకుఁ గాని పెద్దలయొద్ద కుఁగాని వెళ్ళి ఆవిషయమును దెలిసికొనవలె ను ; ఆ గ్రంథమును సంపాదింపవలెను. ఎక్క డను దొరకనియెడల ఏభాండాగారమైన కొ నునటుల చేయవలెను. పల్లెయందుఁగాని ప ట్టణమునందుఁగాని నివసించియుండు ప్రతిపురు షుఁడును స్త్రీయును ఏయేగ్రంథములను జదు వనిచ్చగలిగియుండిన ఆయా గ్రంథములు నెల్ల సంపాదించి వారికందఁ జేయవలెను. చందా దారుఁడై నను కాకపోయినను ఈ సౌకర్యము ను గలిగించుట మంచిది. గ్రంథ భాండాగారి కుఁడు పుస్తకముల కాపరి మాత్రమైయుండఁ బోక, చదువరులకుఁ గావలసిన పుస్తకముల ను పుస్తకములకుఁగావలసిన చదువరులను సమకూర్చువాఁడుగా ఉండవలెను. గ్రంథాలయమును జ్ఞానమునకును, సన్మార్గత కును దోహద ప్రదేశముగ నుండునటుల చేయ వలెను. అటులగానియెడల, ఉపాధ్యాయుఁ డు లేని పాఠశాలవలె అది నిరర్థకమగును. అతఁడు గ్రంథాలయమునకు స్వంతముగా భవన ముండుట మిక్కిలి యావశ్యకము; గ్రామము నందొక పాఠశాలయందుఁగాని, దేవాలయ మునందుఁగాని, సత్రమునందుఁగాని, పెట్టుట కంటె, ప్రత్యేక భవనమునందుంచుట మిక్కి లి కర్షకముగ నుండును. ఈయావశ్య మును గ్రహించి విరిదినఱకే భవననిర్మాణ మును జేసియుండు టెంతయు ప్రశంసనీయము. గ్రంథాలయములయందుత ఱుచుగశాల 66. గ్రంథములకంటే నవలలు మొదలగు విశేష బుద్ధి నుపయోగింప నగత్యము లేని సులభం గ్రంథములనే విరివిగచమనుట సహజమైయు న్నది. అందుచేత ఆయా గ్రంథములయందలి విషయములనుగూర్చియు వాని యుపయోగ మునుగూర్చియు గ్రంధభాండాగారికులు తఱు చుగ నుపన్యాసములనిచ్చుచు బోధింపుచు ఆ గ్రంథములయెడల అభిరుచిని కలిగింపవలెను. శాస్త్రగ్రంథములు మొదలగు కఠిన గ్రంథము లను అందఱును చదువునటుల చేయుట కింతకం టె మంచి పద్దతి లేదు. ఇందుకుదృష్టాంతము:- “విజ్ఞానచంద్రి కామండలి” వారిచే నిటీవలఁ బ్రక టింపఁబడిన “వ్యవసాయశాస్త్రము”, “ఆర్థిక శాస్త్రము”, “రాయచూరు యుద్ధము”, యనగరసామ్రాజ్యము” ఎంతమంది చదివియు న్నారో ఏగ్రంథాలయము యొక్క గాని పు స్థ కముల నిండ్ల కుఁదీసికొనిపోవుపట్టీని దీసి చూ డుఁడు. ( రాయచూరుయుద్ధము', విజయనగ రసామ్రాజ్యము' అనుగ్రంథములను నూఱు మందిజదివియున్న ఒక్క రైన 'ఆర్థికశాస్త్రము' చదివియుండరు ; వ్యవసాయ శాస్త్రము'ను ఒకరిద్దఱు చదివియుండిన చదివియుండవచ్చును. ఇట్టిస్థితియందు గ్రంథ భాండాగారి చేయఁదగిన దేమి? 'వ్యవసాయశాస్త్రమునం దేయేవిష యములు వివరింపఁబడియున్న వెూ, ఆవిషయ ములను పఠించుటవలనఁ గలుగులాభము లెవ్వి యో, అప్పుడప్పుడు ఉపన్యాసములమూల మునఁ జెప్పుచు అగ్రంథమునందలి కొన్ని భాగ ములనుజదివి బోధించుచుండవలెను. ఇట్లుబో ధించుచుండిన కొంత కాలమునకుఁగాక పోయి న మఱికొంత కాలమున కైన ఆగ్రంధమునందా స క్తి జనియింపకపోదు. ఈవిధముగ గ్రంధ భాండాగారికుఁడు తన గ్రంథాలయమునందలి