పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/13

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయములు - అవి చేయవలసిన పనులు.

బోధించుటయైన మనకు చేతఁగాని పనికాదు. సామాన్యజనులకు తగిన గ్రంథములను సమ కూర్చుటలోగాని, వారికి జ్ఞానమును గలుగఁ జే యుటలోఁగాని ప్రథమప్రయత్న ములయందు మన మపజయము పొందవచ్చును. అంత మాత్రముచేత మనము ప్రయత్న పరాఙ్ముఖు లము కానక్కజు లేదు. ఒక మార్గము సరిపడ నియెడల మఱియొక మార్గమున పోవలసి యుండును; ఒక సారి కార్య కారిగానియెడల మ ఱియొకసారి తిరిగి ప్రయత్నింపవలసియుండు "ను; అంతే. ఇటుల మనవిధ్యుక్తధర్మమును వి డువక తోడివారిని వారి పిల్లలను అజ్ఞాన తి మిరగుహనుండి వెడలించి ఔన్నత్యశిఖరము నధిష్ఠించునటుల చేయ టకు సదా పాటుపడు చుండవలయును. ఎవరికి మనము సాహాయ్య ము చేయవలసియున్న దో వారినిగూర్చి ప్రథ మమున చక్కఁగా విచారింపవలెను; భేషజ వేషముల నన్నిటిని విడిచి, వారు మనల తమ తోడివారుగా భావించుకొనునటుల వారిదగ్గ ఱకుపోయి, వా రేమికోరుదురో అడిగి తెలిసి కొన వారికొఱఁతలను తీర్పవలెను. కొన్ని సమయములయందు వారి అఁతలు మన భావనలకు భిన్నములై యుండును. యినను, మొదట వారేమి కోరుదురో తెలిసి కొనవలె ; పిమ్మట వారి వాంఛలు నెఱవేర్ప వలె. ఈ కార్యము వేసవికాలపు సెలవులలోఁ గాని శీతకాలపు సెలవులలోఁ గాని చేయఁదగి నది కాదు. ఇది జీవితమునంతయు ధారవోసి చేయవలసిన మహత్కార్యము.

కొందఱు వివిధ దేశముల యొక్క వార్తల ను మాత్రము వినఁగోరెదరు. వారికట్టివార్త లనుమాత్రమే చదివి వినిపింపవలెను. క్రమ ముగ వారు ఇతరవిషయములను గూర్చి కూ డఁ దెలిసికొన నిచ్చగించెదరు. కొందఱు పు సకములను వినఁగోరెదరు. వారికి పుస్తక ములనే చదివి వినిపింపవలెను. ఆపుస్తకము లు వారికి తగియుండునని మీరుమాత్రము తలంచునవియై యుండఁగూడదు. వారుకో రునవియు వారి రుచులకనుగుణ్యముగ నుండు నవియునై యుండవలెను.

ఇంతవఱకును, విశేష ముగ, చదువు కొనఁజాలని జనుల నెటుల నాకర్షించి జ్ఞాన వంతులనుగఁ జేయవలయునో చెప్పితిని. ఇక ముందు చదువుకొనిన జనుల నెటుల నాకర్షిం పవలెనో తెలిసికొనఁ బ్రయత్నింతము. గ్రం థాలయమునందు కొన్ని బీరు వాలనిండ వు స్త కములనుంచుటమాత్రము చాలదు. ఆబీరు వాలెప్పటికప్పుడు ఖాళీగా నుండవలెను. అనఁ గా వానియందలి గ్రంథములను ఎల్లప్పుడును జనులు చదువుచుండవలెను. చదువుకొనున లవాటును కలుగఁచేయుట మనవిధి. ఈయల వాటు ఒక దినమునఁగాని ఒక సంవత్సరమునఁ గాని కలుగఁ జేయఁజాలము. కావున, ప్రథమ దశలయందు జనులు గ్రంథముల నెక్కువగ నుపయోగింపనియెడల గ్రంథాలయస్థాపకు లు దిగులు పడవలసిన అవసరము లేదు.

(౧) గ్రంథములు. (అ) గ్రంథ భాండా గారికుడు. (3) భవనము. అనుమూడును గ్రం థాలయమునకు ప్రాణాధారములు. ఎవరై నను ఏవిషయమునైనఁ దెలిసికొనవలెనని కా నీ, ఫలానాగ్రంథము కావలెనని కాని, గ్రం థాలయమునకుఁ జనుదెంచినచో భాండాగారి కుఁడు తనకావిషయము తెలియదనియు తన