పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/10

ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 88 గ్రంథాలయ సర్వస్వము.

స్వరములనుబ్రస్తగించెడు పాటకులకు అమృత సదృశంబయిన గీతియబ్బదేము! మొగము నవనీతమృదులమై యెగయు చెలికి మనసునవనీతమయి యుండదనుటెనిజము!

వనలతలకును నుద్యాన వనలతలకు భేదమరసినకవి యెంత వేత్త యగునో! గాత్రమెత్తి యా బైరాగి కన్నె యట్లు పాడుచుండెను, వాకిండ్ల వాడ లెల్ల చిత్త గువులలో రాణించు చెలువుదోఁ చె ఎచటివారచ్చటనె చలియింపకుంట. వీధి వీధులఁ బొరలె నాబిడ విలాస రాగలాలిత గానతరంగ భరము తెలి తమలపాకు తీవ పాదులకుఁ బాఱు ధవళజలకుల్య భాతినార్ద్రంపుగతుల. ఆమె పాడిన పాటల నాలకించి అందుముకుళించియున్న భావార్థమెంచి ఒక విధం బైన యున్మాద చకితదశల కగ్గమైతిమే మిరువుర మద్భుతముగ .

గ్రంథాలయములు-అవి చేయవలసిన పనులు.

భీమవరము తాలూకా కుముదవల్లి యందలి శ్రీ వీరేశలింగ కవిసమాజము యొక్క పదునెనిమిదవ వార్షికోత్సవ సమయమున అగ్రాసనాధిపత్యము వహించిన అయ్యంకి వేంకటరమణయ్య గారిచే నియ్యఁబడిన యుపన్యాసము.

ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమునందు మీ భీమవరము తాలూకా ప్రథమమునఁ బేర్కొనవలసియున్నదని తెలుపుట కేంతయు సంతసిల్లుచున్నాఁడను. దేశమునందు గ్రంథపఠ నాభిలాషగాని, వార్తాపత్రికాగ్రహణాసక్తి గానివి శేషముగకలుగనప్పుడే, రాజకీయాందో ళనావశ్యకతను పట్టణములయందు సహితము జనులు బాగుగ గ్రహించియుండనప్పుడే, మీ తాలూకాయందు “ఉండి" గ్రామమునను మీ గ్రామముననుగూడ సమాజముల నేర్పఱుచుకొని స్వాభివృద్ధిని గలుగఁ జేసికొనవలయుననెడి వాంచ జనించుట మిక్కిలి ప్రశంసనీయము. భరతఖండ పితామహులగు దాదాభాయి నౌరోజీగారి యొక్కయు, ఆంధ్రదేశ పితామహులగు రావు బహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారి యొక్కయు పవిత్ర నామములతో మీరెండు సమాజములను ప్రారంభించుట మిక్కిలి యానందమును గొల్పుచున్నది. తన నిరుపమాన దేశాభిమానముచేతను, స్వార్థ త్యాగము చేతను, దీక్ష చేతను భరతఖండమునం కార్యనిర్వహణ దంతటను పూజ్యభావముతో వెలుంగుచున్న శ్రీ దాదాభాయి నౌరోజీగారియొక్క గొప్పతనమును గ్రహించి నేఁటి కిరువది సంవత్సరములకు ఁ బూర్వమే బూతాలూకాయందున్న ఉండి గ్రామమున వారినామముతో “నౌరోజీ క్లబ్బు" నేర్పఱుచుటయు, నవీనాంధ్ర వాఙ్మయమున కంతకును మార్గదర్శియు సంఘము నందు ప్రబలియున్న దురాచారములను నిర్మూలింప తన యావజ్జీవితమును ధారవోయఁ గంకణము గట్టుకొనిన మహనీయుఁడును నిరుపమాన స్వార్థత్యాగియు నగు శ్రీ వీరేశలింగము పంతులుగారి యెడల మీకుఁగల కృతజ్ఞతను జూపుటకై నేఁటికి పదు నెనిమిది సంవత్సరములకుఁ బూర్వమే మీరు శ్రీ వీరేశలింగ కవి సమాజము నేర్పఱుచుటయు మి