ఈ పుటను అచ్చుదిద్దలేదు
86

గోపదంపతులు.

మ్మ సంతోషించి, దానిని దనకరకమలమునం గీలించి, యాఘ్రాణించుటకై నాసికాపుటముల దరికి జేర్చునప్పు, డందు నడుమ గర్ణికాశోభ నలరు కాగితపు మడత యామెకుగనబడెను. ఇంతలో నప్పలసామి తన ‘ఫీట్ ‘ ముగియుటచేత లోనికివచ్చెను. నటేశము మిగుల గలవరపడెను. “నీవేల మారహస్యాగారమున కనాహుతుడవై వచ్చితి“వని మనగోపశ్రేష్ఠుడు నటేశమునడిగి యతనితో వస్చప్రతివాదములు జరుపుచుండ, గంగమ్మ యించుక గుండె నిబ్బరపఱచుకిని కుసుమగుచ్చ మద్యమందున్న లేఖను మెల్లగా బైకిదీసి రైకలోపల దాచెను. క్రమముగా నాపురుషులిరువురు వాక్కలహములోనికి దిగిరి. పూలగుత్తి యిచ్చుట కెట్ట్వానికేని హక్కుగలదని నటేశము మొండివాదముగా బలుక, నప్పలసామి మిగులగినిసి, యాగుత్తినెత్తి ముక్కలుముక్కలుగాజీల్చి, బాఱవైచి, నటేశమును మెడబట్టి యొక్కత్రోపుతోసి గెంటెను. అతడు చస్పచుట్టగా నేలబడి లేచి యొడలుదులుపుకొని చప్పుచప్పున వావలికి జాఱెను.

    అప్ప—గంగూ! నీచర్య నాకు గడువింతగానున్నది. నీవు మేకవన్నె పులిలాగున దోచుచుంటివి. నాయెడ నలకప్రేమ నటించుచు నీవు దుష్టులగు చెట్టియార్లతో మంతనము సల్పుచున్నట్లు కనబడుతున్నది. నిన్న సంతలోనీవు దరిదప్పుడా రామయ్యతో గూడి హార్మోనియముల దుకణములో నున్నట్లు నస్కనుమానము గల్గినది. అది నిజమే