ఈ పుటను అచ్చుదిద్దలేదు

81

పార్కు ఫేర్.

    అని యింకను జెప్పబోవుచుండ నామెకేదో కంఠధ్వని, భర్తయెలుగువంటిది, వినబడ నాగిపోయెను. అదే మట్టులుంటివని రామయ్య యడుగ దన యనుమానము దెల్పెను. రామయ్య యించుక యీవలికి వచ్చిచూడు బ్రక్కగదిలోనప్పలసామియు రామస్వామి మొదలియారును హార్మోనియములను బేరమాడుచుంట గాంచెను. అతడుకలతపడి లోనికేగి "నీయనుమానము నిజమే. కిమ్మనక యుండు" మనెను. సర్కసుబ్యాండులోని శ్రురికుపయోగించు హార్మోనియము వంటి వాద్యమొకటి చెడిపోయినది. వారు క్రొత్తదికొనగోరి యిందువచ్చి బేరమాడుచుండిరి. సుందరముచెట్టి లోన గంగమ్మయుంట మఱచి వారికా వాద్యములం జూపుచు మాటాడుచుండెను. రామయ్య యొకసారి యీవలకువచ్చి యేగుట యప్పలసామి కించుక పొడగట్టును. ఆవల నతడా యగానిమంతయు గలయదిరుగుచు దక్కుంగల వాద్యవిశేషములు దిలకించుచుండ దనభార్యచేతి గాజు చప్పుడు వినబడెను. అది భ్రమయని తలంచెను. రెండవ యగారములోనికిబోయి చూడగోర, సుందరముచెట్టి 'వల దందెవ్వియులెవు. సామిత్రులు మాటాడుకొనుచున్నా ; రనెను. అప్పలసామి దానింజూడక మొదలియారుతో నాయంగడివిడిచి యీవలకువచ్చెను. అప్పుడు 'సామిపిళ్ళ వెళ్ళినాడు. ఇంకభయములే ' దనుమాటలు వినబడెను. అప్పలసామి కాశ్చర్యము తోచెను. యోజనాదృష్టితో నతడు మొదలియారుతో మోటారెక్కిపోయెను.