ఈ పుటను అచ్చుదిద్దలేదు
80

గోపదంపతులు.

లకు నేనన్యధా తలంపను. తమరుమాత్రము నాయెడ నాసవీడుడు.

    రామ--నీవంగీకతిమపకున్న నేనాత్మహత్య కావించుకొనవలసివచ్చును. నేను గన్నుగీటునప్పటికి నాపాదాంతికమునకు వచ్చివ్రాలు నన్నెటుడు లెందఱున్నను నేనొల్లను. నాకునీతోడి పొందే కావలయును. నీవు నిక్కముగా నాకోర్కె దీర్పకుందువేని, నాప్రేమచిహ్నముగా నాయాస్తియెల్ల నీపేరవ్రాసి యిచ్చి నేనాత్మహత్య చేసికొందును.
   గంగ--మీ రంతటితెగువకు గడంగ నక్కఱలేదు. మీకు నాపయి గల్గిన యకారణకరుణకు నేను గృతజ్ఞ నని మరల వక్కాణింతును.
  రామ--కృతజ్ఞత కార్యరూపమున దాల్చవలయుం గదా! 
    గంగ--దానికిప్పుడు నేను జేయునదేమియు లేదు. నేనింకను గొన్నాళ్ళాలోచించినగాని మీతో నేమియు మనవిచేయజాలను.
    రామ--ఎన్నాళ్ళాగుమన్నను నాగెదను. నీవు మాత్రము నన్ను గైకొనకతప్పదు. నీదర్శనము ప్రత్యహముంజేయుచుందును. ఏనాడు నీవంగీకరించి నావెంటవత్తువొ, నాడుజన్మముతరించునని భావింతును.
   గంగ--సరియే, చూతములెండు. ఇప్పుడుగాదు. ప్రతిదినము--