ఈ పుటను అచ్చుదిద్దలేదు

77

పార్కు ఫేర్.

బాయి! పార్కుఫేర్ చూడవచ్చితివా? ' యని ప్రశ్నించెను. ఇంతవఱకు రామయ్య యామెను వెన్నాడుచుంట యామె యెఱుగదు.అతడట్లు ప్రశ్నింపగా నామె యులికిపడి యతని వంకజూచి, 'అవునండీ! తమరుగూడ నందుకొఱకే వచ్చితిరా? ' యని తిరుగ నడిగెను. రామయ్య, 'అవునటులే' యని మార్వలుకును. గంగమ్మ దగ్గఱకువెళ్ళి, "నీబస కెదుటే ప్రతిదినము నేను సంచరించుచున్నను, నీతొ సావకాశముగా భాషించుటకును నాహృదయము గతాభిప్రాయములన్నియు వెల్లడించుటకున్ దగిన సమయము చిక్కుటలేదు. నేడప్రయత్నముగా నీ వొంటినిండ గాంచగల్గితిని. నీవు నాయందు గృపవహించి నేటిరాత్రమున నొంటిమై, బాణసంచులజూచు నెపమున, నిచ్చటి కేతెంతువేని, నాహృదయమందు జిరకాలమునుండి యిమిడియున్న నాకోరికయొకటి నీతో జెప్పి నాయాశయములనెల్ల నీకు నచ్చునేని నన్ననుగ్రహింపవచ్చును; లేనిచో ద్రోసిపుచ్చవచ్చును. వినినజాలు" నని పల్కెను. గంగమ్మ యంతయు విని కొంతతడ వూరకుండెను. ఆమెహృదయము డోలాందోళితమయ్యెను. కొటీశ్వరుడు తన్ను వలచి రమ్మనుచున్నాడు. రానా రాకుందునా యని యొగసారి తలుచును. ఎంత కోటీశ్వరుడైనను నామగనికన్న నాకు గూర్పువాడగునా యని యింకొకసారి యూహించును. "ఏల పలుకవు? మౌనమర్దాంగీకార మని తలపవచ్చునా?" యని