ఈ పుటను అచ్చుదిద్దలేదు
68

గోపదంపతులు.

కంపనీవారి యాటలకెల్లవచ్చి నా కేదోయొక బహుమానము ప్రతిపర్యాయమును ముట్టజెప్పుచున్నాడు! నిన్నరాత్రియే యొకవిధమైన యవమానము నాభర్తకు వారిమీద బొడమినది. వారు నాతోనే కొంతసంభాషణము చేయుట గన్నను, దానింగూర్చివిన్నను, దదనుమానము వృద్ధియై యతనిమనస్సు చెడిపోవును. ఇప్పుడేమి సేయుదును? వారిరాకనుగూర్చి నాభర్తతో జెప్పనా? మాననా? చెప్పిన, ననుమానము హెచ్చును, మానిన, వారే తమరాకనుగూర్చి నాభర్తతో జెప్పియుందునేని, నాభర్తనామీదగూడ నవిశ్వాసము గలుగ వచ్చును. (కొంతతడ వాలోచించి) వారికి నామగనితో మాటాడు పనియేయున్నయెడల దాము వచ్చినట్టులైన నాబర్త కెఱింగింపుమని నన్ను గోరియేయుందురు. కోరలేదు. ఇక వారిరాక నాకొఱకే, వారు కేవలము నాకోసమే వచ్చిరిగావున, నాతొసంభచించినట్లు తెలుపరు. కనుక నేను నానాధునితో నేమియు బ్రసంగింపకుండుటయే మేలు"

   ఇట్లభావించి యామె గృహకార్యములు చక్కబెట్టు కొనుచుండెను. కొంతతడవునకు నప్పలసామి బసకేగుదెంచెను. భార్యచూపులో గలత యేమేని పొడచూపునేమో, యాచెట్టియార్లనుగుఱించి యామె తనతోనేమేనిచెప్పునేమో, యని యతడు కొంతసేపు చూచెను. కాని యేమియు నామెనొటినుండి రాలేదు. ఆమెచూపులోమాత్ర మొకవిధమైన కలవరి మాతనికి బొడగట్టకపోలేదు. వారిరువురును భోజనము