ఈ పుటను అచ్చుదిద్దలేదు

67

అనుమానము.

  అని మరల మందహాసమొనర్చి ప్రేమైకదృక్కులం బఱపెను. గంగమ్మ కిప్పుడు వారి యభిప్రాయము లెస్సగా బోధపడినది. ఇంక వారితో మాటాడరాదని యూహించి, "అయ్యా! నాకు సెలవిండు, నేను బనులు చక్కబెట్టుకోవలసియున్నది." అని తలుపు గొండెము వైచుకొనెను."ఇంకొకసారి మీదర్శనమునకు వస్తునులెం" డనుచు రామయ్య తనగదిలొనికి బోయెను. సోదరుడు కడునిపుణముగా భాషించినందు నకు నటేశము మిగుల సంతోషించెను. ఆమె తన మాటలకు గోపముచేయలేదనియు నునుసిగ్గుచే గడపటదలుపువైచున్నదనియు, ముందుముందు తనవశము కావచ్చుననియు, రామయ్య పెలికెను. తనవంతుకూడ బ్రయత్నముచేసి చూచెదనని నటేశము పల్కెను. ఇట్లుసంభాషించుచు వారొక గడియ దాక గాలయాపనమొనరించి తలుపునకు దాళమువైచి తమబనులకుం జనిరి. గంగమ్మలోనికేగి గవాక్ష రంధ్రములగుండ గోటీశ్వరుల చర్యలు గమనించి, వారిలో దనతొభాషించిన యువకునకు దనపై మోహము జనించినదని కనిపెట్టి  , తనలోతానిట్లు వితర్కింపజొచ్చెను:--
     "ఆయువకుడు గడుసుందరాంగుడు.లక్ష్మి వాని యింట గాపురమేయున్నదని  తెలియచచ్చుచున్నది. అట్టివాడు నాపై వలపునిలిపి నట్లు  తోచుచున్నది. నన్ను వశమొనర్చుకొనుటకు బలువితముల యత్నించుచున్నట్లు కనబడుతున్నది. పాప మావెఱ్ఱిమొహముచేతనే కాబోలు మా