ఈ పుటను అచ్చుదిద్దలేదు

57

అనురాగాంకూరము.

మియులేదు. మనమిప్పుడు వై.యం.సి.యే భవనమునకుబోదము. పోనీ నీకారేయుపయోగింతములెమ్ము

   రమ—-పోయి యేమిచేయుదము?
   
   నటే— అది యిచ్చటనడుకకుము అక్కడికి వెళ్ళినతర్వాత నేనవచింతు.
   ఇటులుమాటాడి కొన్నినిముసములోనే వారుకారెక్కి పయనమై పోయిరి. వారు మఱికొన్ని నిమిసములలోనే వై. ఎం. సి.యే మందిరము కడకు వచ్చిరి. వారుతిన్నగా మేడమీదికేగి మందిరాధికారి కడకరిగిరి. అతడు వీరికి భక్తితో స్వాగతమిచ్చి సుఖాసనాసీనులం జేసెను. అప్పుడు నటేశము, “అయ్యా! ఇందాక నొకగంటక్రింద నేనొకజాబు పంపితిని. దిచేరినదా?” యని మందిరపాలకునడిగెను అతడు జబందినదనియు,వానికోర్కెప్రకారము మూడవయంతస్తులొనిగది ‘కాళీ ‘ చేయించియుంటిననియు, నెప్పుడుగావలసిన నప్పుడందు బ్రవేశింపవచ్చు ననియు, మర్వలికెను. ఒకకవలివాడు వెంటరా వారాగదియొద్దకు జనిరి. అందు దమకుగావలసిన యాసనాదికములంగూర్చి యలంకరింప గావలివాని కాజ్ఞయిచ్చి వారు వెనుకకుమరలిరి. అప్పుడే గంగమ్మ యెదుటనున్న తనగదికిటికీలోనుండి వీరివంక నొకసారి చూచెను. వారును వారచూపులతో మరల నామెను జూచుచు గ్రిందికి బోయిరి