ఈ పుటను అచ్చుదిద్దలేదు

6. దుష్టద్వితయము

రంగస్దలమ నలంకరించిన యాగొపదంపతులు రతీ మన్మధులవలె నుండిరి. అటు జూడవచ్చు ప్రేక్షకుల కధ్యక్షుడుగా నియమింపబడిన గవర్నరుగారు మన నాయికాయకులను దదితరసభ్యులను గొనియాడుచు నొక యుపన్యాసమిచ్చిరి. ప్రేక్షకులలో, కొందఱు ధనవంతు లా దంపతులకు బదకములొసంగిరి, కొందఱు రంగస్దలముమీదికివచ్చి వారిందారసించి కరములం గీలించి యాడించుటచే దమమెప్పును తెలియబఱిచిరి.

   ఇట్టు లాప్రధమప్రదర్శనము ముగిసెను. కర్షకజీవన మొనరించు మననాయికానాయకులకు నాగరికత మఃహోన్నతదశం జేకూర్చ దిగంతవిశ్రాంతయశంభును గల్గించెను. ఆహా! నాగరికప్రభావము!

6. ధుష్టద్వితయము.

     చెన్ననగరభాగ్యలక్ష్మియెల్ల 'చెట్టియా ' ర్లనబడెడు జాతివారియందు గలదని చెప్పవచ్చును. అచ్చట సెట్లని కొందఱందురు. వారు వైశ్యకులజాతులు. వారిలో నాంధ్రులెక్కువమందిగలరు. చెట్టియార్లనబడు వారు వివిధజాతులవారగు శూద్రులు. ఈతెగవారిలో విశేష విద్యావంతులును, నున్నతోద్యోగులును, గొప్ప కర్మాగారముల కధ్యక్షులును బె