ఈ పుటను అచ్చుదిద్దలేదు

41

నాగరికత.

గొన్నిదినము లెటులో వెళ్ళబుచ్చినది. నిరంతరమైన తనకోరిక యీడేఱిందని మిగులమురిసినది. కాని యామెకా యానంద మెంతకాలమునుండును? చెన్నపట్టణ మిప్పుడామెకు బ్రాతనపడినది. నేనింటలేని  కాలమామెకు భారముగా గనబడుచున్నది. దానినెట్లు సవరింపగలమో  తెలియకున్నది.
     రామ--నేనందునుగూర్చియే మీతొ బ్రసంగింప వలెనని తలచి వచ్చితిని. మాపట్టణములోని స్త్రీ లెట్టులు యధేచ్చముగా బాఠశాలలకుబోవువారు కొందఱు, క్లబ్బులకేగువారలు కొందఱు, ఉద్యోగముల కరుగువారుకొందఱు. పురుషులతోజేరి యుపన్యాస వేదికలపై నిల్చి ప్రసంగించువారు కొందఱు, కాన్పించు చున్నారో మీరును మీయర్దాంగియు జూచియే యున్నారుగదా!
  అప్ప--చూచితిమి. అట్టులేదేని యొకపాఠశాలకు బంపి నాభార్యకు విద్యనేర్పింపుమదురా?
    రామ--ఆమెకు విద్యనేర్పుటకు మీరామను బాఠశాలకు బంపనక్కరలేదు. ఆమెకు గావలయు విద్య యింటనే నేర్పింపవచ్చును. మీవలెనే యామెయు భగవంతునిచే శరీర బలము ప్రసాదింపబడినది. మీరుచేయు క్రీడలుకొన్ని యామెకు మీరేనేర్పి మీరును నామెయుగలసి రంగస్దలమున గొన్ని వింతయాటలం బ్రదర్శిందురేని  మీకెర్తియు మాకీర్తియు నచిరకాలములోనే యాశాంచలములం దాకును.