ఈ పుటను అచ్చుదిద్దలేదు

39

నాగరికత.

రుచిలేని శాకాదులతోను దినవలసివచ్చెను కాని వానిలోనే మేలిసరకును సేకరించుకొని వారు కాలక్షేపము జేయుచుండిరి. వారికి నిత్యమును గాఫి క్లబ్బులలో లభించు హల్వాలు, సేమియాపాయసము, లడ్డువులు మున్నగునవి యచ్చట గలుగు నాహారలోపముం దీర్చుచున్నవి.

    ఒకవారము దినములిట్టులా పట్టణజీవనమున కలువడిన పిమ్మట సర్కసుకంపెనీవా రప్పలసామిని సర్కసుశాలలోనికి దీసికొనివెళ్ళి యతని సోదరోద్యోగులతో బరిచయము గలిగించిరి. మొదట వ్యాయామక్రీడలం దాఱితేరినవారు చేయు నృత్యము లన్నియు నప్పలసామి  చూచుచు గొన్నిదినములు గడపెను. ఆవల నొకనాడతడు తనసొదరులతో నొక్కొక్క డోవర్సు కష్టపుబలములనెల్ల నవలీల  గడులాఘవ  మొప్పుజేసి యందఱ నాశ్చర్య రసమగ్నులం గావింప జొచ్చెను. ఇట్టులాత డచ్చటి మేటివస్తాదుల నతిక్రమించిన వార్త పట్టణమంతయు నలముకొని యతనింజూడ గొందఱును, నతనితో బరిచయముగలుగ జేసికొంజు గొందఱును, నతని బసకు రాజొచ్చిరి. పట్టణమందు బ్రతిదినము వెలువడే వార్తాపత్రికలలో స్టారు సర్కసుకంపెనీవారి భావికార్యక్రమసూచికలో నప్పలసామి చేయు వింతలపనులం గొండాడుచు వ్రాయబడిన ప్రకటనము లెన్నియో పొడసూపజొచ్చెను. ఇంతకుమున్ను కంపెనీలో బనిజేయు వారొనరించు వ్యాయామభేలన ములందు మనయప్పల