ఈ పుటను అచ్చుదిద్దలేదు

37

ప్రయాణము.

మిత్రుడు క్రమ్మఱ వారికాహారముం దెచ్చియీయగా వారు సుఖముగా భుజించి జామురాత్రి మీఱుదాక మేలుకొని యవల దమకై యమర్పబడియున్న మెత్తలపై బండుకొని సుఖనిద్రంగాంచిరి. వారుదయము ననే లేచి కాల్యంబులు దీర్చి యందే యమర్పబడిన నీటిలో దానమాడి ధొతవస్త్రములు ధరించుసరికి వారు చెన్నపట్టణ మందలి 'సేంట్రల్ స్టేషన్ ' లో బ్రవేశించిరి. స్టేషనులోనికి రైలు బండి పోవుటయు నందు మనోహరములైన గాలులు వీచు ఎలక్ట్రిక్కుపంకా అమర్చబడి యుంటము గంగమ్మగాంచి యత్యాశ్చర్య పడుచుండెను. అప్పలసామిగూడ నవియెల్ల యెఱుగని వింతలేయైనను నతడు గభీరహృదయుడు గావున బైకేవికారచేష్టయు గంపడనీయక చూచుచుండెను.

     అక్కడికి సర్కసుయజమానుడు వచ్చి గోపదంపతులకు స్వాగతమిచ్చి వారినొక మోటారు బండిలో గూర్చుండబెట్టుకొని హైకోర్టుభవనములకు నెదుటనున్న వై.యం. సి.యే వారి యున్నతహర్మ్యము కడకు తీసికొనివచ్చి యందు మూడవ యంతస్తుమీద నొక విశాలాగారమందు విడియించిరి. దారిలో ట్రాముబండ్ల రాకపోకలు, మోటారుబండ్ల సరువులు, రిక్షాల సందడులు, జనసమూహముల సంచలనములు, మున్నగు వానినెల్ల గంగమ్మ గాంచి నిర్వచించరాని యానందమొందెను. ఆమెక్కొక్క విషయంగూర్చి సర్కసు