ఈ పుటను అచ్చుదిద్దలేదు

33

ప్రయాణము.

ర్తించెను. కరణముగారునుదమకుంగూర్చుమంచిరయితు తప్పిపోవ్వుచున్నందుల కించుక వగచుచుండియు, వారికున్నతోద్యోగము తటస్దించి వాడున్నతనసంఘములో జరిపింపనున్నందులకు సంతోషించుచు ముచ్చిలకాపత్రము నిచ్చెను.

   ఈపనులన్నియు ముగిసిన తర్వాత నప్పలసామి సర్కసుకంపెనీవారికి దాను బ్రయాణమునకు సంసిద్ధిడనై యుంటినని తెలియజేసెను. వారు తమకడ లేఖకుడుగానున్న యొక యాంధ్రుని చేతికి బ్రయాణవ్యయము నకు దగిన మూల్యమొసంగి గోపాలపట్టణము పంపిరి. గంగమ్మయూర నున్న పేరంటాండ్రను, ముఖ్యముగా దనజస్తివారనెల్ల, రావించి వారికి బసుపుకుంకములును బండ్లును రవికలగుడ్డలును బ్స్ంచిపెట్ట్ వారియొద్ద సెలవు బుచ్చుకొనెను. సాధారణముగా నట్టిజాతులవారు మత్తుపదార్దములు పుచ్చుకొని యించుకనీతితప్పి చరించుట గలదు. కాని గంగమ్మకట్టి దురభ్యాసము లెవ్వియులేవుగావునను, జిన్ననాటినుండియు బ్రాహ్మణులవలె శాఖాహారములతో బెరిగినది. గావునను సురాపాన మెవ్వరి కొసంగకుండెను. గ్రామములో గాపురమున్న ద్విజులుసైతము తమ యాండ్రను గంగమ్మయింటికి దగవులిచ్చిపంపి యాదరించిరి అమెవియోగ మాయూరస్త్రీల కెంతో కష్టముగానే యుండెను. ముఖ్యముగా స్టేషనుమాస్టరు గారి భార్యకు మఱియుదు:ఖకరముగానుండెను. ఆమెగంగమ్మయా