ఈ పుటను అచ్చుదిద్దలేదు

27

వింతమార్పు.

లోనె యుండుటొప్పు ఒకవేళ నాకు గొప్ప పట్టణములో బోవబుద్ధిపుట్టిననునదిసాగుటెట్టులు? ఆ పోలీసుసూపరింటెండెంటు వారి కృపవలన నేనింత కడుపునిండ దిండిని నాభార్యను బోషింప గల్గుతున్నాను. చెన్నపురికే పొవుదునేని మాబ్రతుకెట్టులు?
    రామ--సామీ! మీరీడ నెలకెంత సంపాదింతురు?
  అప్ప--ఆవులుగేదెలు మున్నగువానివలన దినమునకు రెండురూపాయలు గిట్టును. వ్యవసాయమువలన దిండిగింజలును, బశువులకు  గొంత సౌకర్యమును లభించును. నేను, నాభార్య, సుఖముగా దినుట నాకాదాయము సరిపోవుచున్నది.
    శంభు--మీరుచెన్నపురిలోనే యుండుటకు సమ్మతింతురేని మీకునెలకు రెండువందలచొప్పున నేనేయీయగలను?
   అప్ప--మీరు నాకు రెండువందలిచ్చి నావలన మీరుపొందు నుపకృతియేది? అంతజీతమునకు దగిన సేవ జేయగలనా?
   శంబు--మాసర్కసుకంపెనీలో మీరుకూడ బనిచేయుడు. మీకు  మంచి 'ఫీట్సు ' మేము నేర్పింతుము. మీవలన మేము కొన్నివేలు సంపారించగలుగుదుము. వానిలో మీకు రెండువందలిచ్చిన మాకేమియు నస్టముండదు.
     ఈమాటలన్నియు జాటుననుండి వినుచున్న గంగమ్మ భర్తయెటులైన దద్వేతనమున కీయకొని చెన్నపురికి గాపుర