ఈ పుటను అచ్చుదిద్దలేదు
24

గోపదంపతులు.

     అప్ప-- అయ్యా! మీకునాయెడలగల వాత్సల్యముచే నట్లుపల్కుచున్నారు. గాని నిజమూహించిన నేనంతశక్తిమంతుడనా? వారికి నేను జేయగదగిన యుపకారమేదియో కలదంటిరి., అది యెట్టిదో సెలవిండు. మీయాజ్ఞ కెప్పుడును బద్ధుడ నేగదా!
     ఆర్మొ---వీరిరువురు జెన్నపట్టణములోని స్టార్ సర్కసున కధిపతులు. వారు వార్తాపత్రికలలో నీకీర్తి విని నీయొద్ద మంచి పొట్టిగిత్తలు కలవని తెలిసికొని వానిలో గొన్ని తమసర్కసున కనుకూలములని తోచినవానిని గొని తీసికొనిపోవలెనని వచ్చియున్నారు. వారేవచ్చి చూచుకొన్న బాగుగనుండునని వ్రాసి వారినే రావించితిని. నీకడనున్న గిత్తలను వారికిజూపి వారుకోదునవి యర్హమైనవెలకు వారికిచ్చుటయే నీవిప్పుడు చేయదగిన యుపకృతి.
    అప్ప--- పొట్టిగిత్తలలు నాకు వ్యవసాయమునకు బనికిరావుగదా? వానిని బెంచుట కెవల వినోదమునకే యని తమరెఱిగినదే. మీసెలపుప్రకారము వారుకోరిన నఱ్ఱలను వారి కమ్మెదను. ఇక వెలమాటయందురా, వారికి న్యాయమని తోచినంత యీయవచ్చును. పాడిపసువులతొ బాటు పొట్టిగిత్తలును మాయింటి కడనే యుండును గావున, మాయింటికి దయచేసి చూచికొనునుడు.