ఈ పుటను అచ్చుదిద్దలేదు
18

గోపదంపతులు.

    అప్పల--మనమంత వెళ్ళవలయుననియే నిశ్చయించుకొన్నచో, గఱ్ఱిగిత్తనే యమ్మవలయునా? అప్పటికి మన పంట యింటికిరాదా! అందుగొంత యమ్ముకొని వెళ్లిరావచ్చును. సింహాద్రప్పన్న దయవలన మనకు నొకమాఱు రెండుసర్లు కావలయు నన్న జిక్కుపడ నక్కరలేదు. నీకంతగా వెళ్ళవలయు ననియున్న నటులే పోదములెమ్ము. నీకోరిక యీడేర్చుటకన్నా నాకేమి కావలయును?
   గంగ-- ప్రయాణమున కిప్పటినుండియు వలయు వస్తువులను భద్రపఱచుకొనుచుండెదను. ఆ చెన్నపురమునుండి కొన్ని యత్రలుకూడ జేసివత్తము.
   అని నాడుమొదలు పాలికాపులతో మాటాడినను విరుగుపొరుగు వారితో బ్రసంగించినను చెన్నపట్టణ ప్రయాణమును గుఱించియే యామె ప్రసంగించుచుండెను. రాత్రులందునిద్రలో నందును గూర్చియే కలలుగనుచుండును. తాను వింతగా సింగరించుకొని పార్కుఫైరులో దిరుగుచున్నటులే భావించుకొనెను. అచ్చట నాటకములు సర్కసులు మున్నగునవి యెల్ల మగనితో గూడి చూచుచున్నటులే యానందించుచుండెను. తానిక్కర్తుకయు నున్నప్పుడెల్ల నివియే తలుపులు. ఆతలుపులలో నొక్కానొకనాదు తననిత్యధర్మములు దప్పుటయు గల్గుచుండెను. దేనియందైన గాఢమైన వలపువున్నప్పు డట్టులేకదా!