ఈ పుటను అచ్చుదిద్దలేదు

17

స్వప్నములు.

   గంగ--- నేడు సుందరమ్మగారివలన జెన్నపట్టణపు ముచ్చటలెన్నియో దెలిసికొంటినిజుండీ!
   అప్పల-- అవియేమి? నాతోగూడ జెప్పుము.
   గంగ:--చెన్నపట్టణములొ వీధులలోనే రైలుపట్టాలు గలవట. వానిమీద బొగలేకుండ నొకదివ్యశక్తిచే నడుప బడుబండ్లు పోవుచుండునట. అచ్చటిదీపములన్నియు నొక్కసారియే వెలుగునట. డిశంబరునెలలో గొప్ప సంత జరుగునట. దానినిజూచియేతీఱవలెగాని వర్ణీంపనశక్య మట. సుందరమ్మగారసంత కీయేడువెళ్ళెదరంట. వెళ్లుచున్నప్పుడు నన్నుగూడ గొనిపోయెదమనిరి. అప్పుడుమనమిద్దఱము బయలుదేఱి వెళ్ళి యావినోద ములన్నియు జూచి రావలయునని నాకోరిక. మీరేమందురు?
   అప్పల--నేనుగూడ జెన్నపురి కెప్పుడును వెళ్లి యుండక పోవుటచే నొకసారి చూడదగినదే. కాని యచ్చటి నాగరికతను జూచిన, మనముగూడ నటులే యుండవలయునని కోరి చెడిపొవుదుమేమో యని భయపడుచున్నాను.
    గంగ---చూచి వచ్చినంతమాత్రముననే చెడిపోదుమా? మనకెంతో సొమ్మువ్యయము కాదుట.  ముప్పాతిక రూపాయలతో నవియెల్ల దిలికించి రావచ్చునట. మనకఱ్ఱిగిత్త నమ్మియైన మనమీయే డాదంతచూచుటకు బోవలయును.