ఈ పుటను అచ్చుదిద్దలేదు
12

గోపదంపతులు

యామెతో సుఖింపగోరుచున్నానని తెల్పెను. ఆమెయు నునుసిగ్గుమూలమున మొదట మార్వలుకనోడియ వలననాతనిమనోహరాకృతియు విలాసచేష్టలును దన్నాకర్షింప నాతనియభిమతమున కియ్యకొనెను. కాని వారికాపరిణయము సమకూరుటెట్లు! గంగమ్మ తల్లిచాటునను, అప్పలసామి తండ్రిచాటునను బెరుగుచున్నారుగదా!

    కొన్నాళ్ళా యువతీరత్నములు తమహృదయ గతానురాగముల డాగురించుకొనిరి. వెంకటేశ్వరుడు తనకొడుకుని కాస్తివచ్చు సంబంధమేమైన జేయవలె నని యూహించుచున్నాడు. కానిగోపకులలో మంచి యాస్దిగలిగు  వారెవ్వరా ప్రాంతమందులేరు. గంగమ్మతల్లి మాణిక్యమ్మ బ్రతికిచెడినది కావున దన కూతురు  మిగుల అందగత్త్లెయౌటచే దమపూర్వ ఘనతను నిలువబెట్టగల గొప్పసంబంధమేదేని కుదర్చవలెనని కుతూహలపడుచుంఛేను. జమీందారుని భార్యయు నామెకూతుపెండ్లికగు వ్యయము భరించునని8 వాగ్దానము చేయుటచే దగిన చుట్టఱికము కొఱకెదురుచూచుచుండెను. వధూవరుల పెద్దల కిట్టియభీప్రాయములుండుట చేతనే వారు మనోగతభావములను వెల్లడింపక రహస్యముగా గూడి మాటలాడుకోనుండిరి.
   ఇట్టులొకయేడాది గడవగా వెంకటేశ్వరుడు హఠంబున వాంతిభేదిచే మరణించెను. కొంతపాత్ర సామగ్రియు గొయ్యవస్తువులుకొన్నియు మాత్రమే యతడు కొడుకునకు