ఈ పుటను అచ్చుదిద్దలేదు

175

ఉపసంహారము.

మ్మ చేవ్రాలు చేయించి కరణప్రభృతులచే సాక్షివ్రాళ్లు చేయించి, యప్పగించిరి. అప్పలసామి చరాస్తియంతయు బండ్లపైనెక్కించి, పిళ్లగారు తమబసకు గొనిపోయి. బిడ్డకాశౌచదినములు గడచిన పిమ్మట నొకశుభముహూర్తమున మాణిక్యమ్మతో బిడ్దను విశాఘపురికి బయనముచేసి పంపిరి. సుందరమ్మకూడ నొకటి రెండువారములు బిడ్డ ముత్తవ్వవద్ద నలవాటు పడువరకుండుటకు నిశ్చయించుకొనియేగెను.

    మాణిక్యమ్మ తానూడిగముచేయు జమీందారిణి యొద్దకు బిడ్దను గొనిపోయి దానియవస్దయెల్ల జెప్పి యంగలార్చెను. జమీందారిణి యాబాలికపై ననుకంప బూని యెన్నో చొక్కాయలును గట్టించి యాడుకొనుటకు  బెక్కు కీల్బొమ్మలిచ్చి యాదరించెను.పిళ్లగారొకనాడు విశాఘపురికిబోయి యప్పలసామి, బ్యాంకిలో దాచుకొన్న రొక్కమంతయు బిడ్డపేరవ్రాయించి దానికి శాశ్వతొపకార మొనరించి తమభార్యను దీసికొని సొంతబిడ్డను వీడినను జననీజనకులవలె గంట దడిపెట్టుకొనుచు గోపాలపట్టణమునకు జనిరి.
     శకుంతల శుక్లపక్షశశాంకునివలె దినదిన ప్రవృద్దమానయగుచు నమ్మమ్మయింట బెరుగుచుండెను. ఆమెరూపరేఖావిలాసములకు దెలివిదేటలకు నెల్లవారును ముచ్చట పడుచుండిరి. దానికి దల్లియందముదండ్రి యౌదార్యమును గల్గుటచే, నది మిగుల దర్శనీయమై యున్నది. దాని చుఱుకుదనము జూచి రాణిగారు దానిని దొరతనము వారి బాలికా పాఠశాలకు బంపి చదువు జెప్పింప దొడగిరి.అది యేటే