ఈ పుటను అచ్చుదిద్దలేదు
174

గోపదంపతులు.

దరమ్మ శకుంతలకు స్నానము జేయించి తలతుడిచి యెత్తుకొని లాలించుచుండెను. శకుంతల బిక్క మొగము వైచికొని, సుందరమ్మ బుజ్జంపుమాటలనేమి యు జెచినిబెట్టక, వెలవెలబోయి చూచుచుండెను. అమ్మమ్మ యాక్రందనధ్వని విని పిల్లకూడ నేడువజొచ్చెను. మాణిక్యమ్మ సుందరమ్మ యొడిలోనున్న మనుమరాలినెత్తుకొని, బిగ్గగౌగిలించుకొని బిట్టువాపోవజొచ్చను. "అమ్మా! నోరెఱుగని యీకూన గుండెచెదరగొట్ట నట్లెడ్వదగునా? నీవు గర్భశోకమును లోలోన నిమిడ్చికొనవలయు గాని యీబిడ్డకెఱుకపఱపరాదు. నీకీబిడ్డయే కూతురు. గంగమ్మమాట తలపెట్టకు" మని యోదార్చెను. మాణిక్యమ్మ బిడ్దయడలునని పొరలిపొరలి వచ్చుదు:ఖమును దిగమ్రింగుచు లోలోన గులుముచు గూరుచుండెను.

      కొంతతడవున నార్మొగముపిళ్ళగారుకూడ స్టేషనునుండి యింటిలోనికివచ్చి మాణిక్యమ్మను బరామర్శించిరి. గోపదంపతులు గతజీవనవిధాన మంతయు బూసగ్రుచ్చినట్టు లామెతో జెప్పిరి.ఈరీతి గొంతసేపు జరిగినతర్వాత బిళ్ళగారు మాణిక్యమ్మను శకుంతలను వెంటబెట్టుకొని గ్రాముములోని కేగి కరణముగారిని దర్శించి యప్పలసామి కాపురమున్న యింటిలోనికిబోయిరి. కరణముగారు గ్రామమందున్న గౌరవనీయులగు మనుజులను గొందఱిని బిలిపించి, వారియెదుటవ్ అప్పలసామి యాస్తియంతయు మాణిక్యమ్మకిచ్చి శకుంతలకు యుక్తవయస్సు వచ్చినతర్వాత దానిని దుర్వినియోగము చేయకుండ నప్పగించు పద్దతిమీద  నొకటివ్రాయించి యందు మాణిక్య