ఈ పుటను అచ్చుదిద్దలేదు

173

నిధనము.

ప్రాణములు విడిచిపెట్టెరని నిశ్చయించి , తీత్పట్లు వ్రాయించి రెండుశవములను గలయజుట్టించి శ్మశానవాటికి గొంపోయిరి. ఆశవముం గొనిపోవునప్పుడు గ్రామములోని గొల్లలందరు మరల గోలాటములతొను, రామభజనలతోను గూడ నడచి యూరంతయు నూరేగించుచు బోయిరి.

     ఆగొపదంపతుల మరణవార్త గోపాలపట్టణమందే కాక విశాఘపురములో గూడ దెల్లవాఱుసరికి దెలిసెను. కర్ణాకర్ణి నావార్త గోడేవారి లోగిటం దెలిసెను. అక్కడ నూడిగముచేయుచున్న మాణిక్యమ్మ యావార్తవిని యొక్కపెట్టు నేడ్చుచు గోపాలపట్టణమున కేతెంచెను ఆమె వచ్చుసరికి శవములు దహనము చేయబడుటకు  జితిపై నెక్కింపబడెను. కూతుశవముపైబడి యామె యాశచముల నోర్లనిడి గంగమ్మ కూతును జూచుటకు స్టేషన్ మాస్టరుగారి యింటికేగెను. 
   ఇట్లు మనకధకు నాయికానాయకులగు నాగోపదంపతులు కధావశేషులైరి. వారి జీవచారిత్ర మాంధ్రులకే గాక హైదవుల కెల్లర ననేకనీతులు బోధించుచున్నది. వానినెల్ల సరియుపని చదువరులకే విడిచిపెట్టి మేము నడువమానితిమి.--

20. ఉపసంహారము

     మాణిక్యమ్మ "కూతురా, కూతురా" యని పెద్ద పెట్టున నేడ్చుచు స్టేషన్మాష్టగారియింటి కేగునప్పటికి, మం