ఈ పుటను అచ్చుదిద్దలేదు
172

గోపదంపతులు.

కామె దేహమును గ్రుంగ జేయుటచే నది పైకిదేల కుండెను.వాడట్టు కొంతతడవీదగా నవల వానికొకచోట బుడగలు వచ్చుచున్నటులు, చేపలు తండోపతండము లుగా నందుజేరి యున్నట్టును బొడగట్టెను. అతడక్కడ నొక్కమునకవైచి తడవిచూడ గంగమ్మదేహము సోకెను. వాడా దేహమునుబట్టి యొడ్డున కీడ్చుకొనిచ్వచ్చి చూడగా నొకస్త్రీ, తానెఱిగిన గంగమ్మయే. ఈమె బలనరణం గూర్చియీమెభర్తకు దెలియజేయుట యొప్పనితలచి యతడు త్వరితగతిని నడచిపోవు చుండగా,దారిలో గాలికి మఱియొక శవము తగిలెను. దానిం బరిమించిచూడ నది యప్పలసామిశవమే యయ్యెను. అతడా దంపతుల మరణమున కాశ్చర్య పడి, దానిని గ్రామాదికారుల కెఱింగింతమని యూరి లోనికిబోయి కరణముగారిని లేపి యావద్వృత్తాంత మును జెప్పెను.

     మఱునాటి యుదయమున కాయూరివారెల్ల నాయేటిదరిక్ చచ్చిరి. బిడ్దతో నార్మొగము పిళ్లగారును సుందరమ్మయు వచ్చిరి. బలవన్మరణమగుటచే పోలీసువారుగూడ వచ్చిరి. పండ్రెండుగంటలవఱకు బంచాయతీ జరుగుచునేయున్నది. ఆర్మొగముపిళ్లగారు గంగమ్మ దుశ్చరితమెల్ల నచ్చట గూడినవారికి వినిపించిరి. సుందరమ్మ కడచిన రేయి నప్పలసామి తనయింటికివచ్చి భార్యబిడ్దను లాలించుచుండ జూచి యామెతో బ్రసంగించుటను గూర్చి సరిస్తరముగ దెలిపెను. ఉభయులు బ్రతుకులపై రోసి ముందప్పలసామియు నవల గంగమ్మయు నేటబడి