ఈ పుటను అచ్చుదిద్దలేదు
168

గోపదంపతులు.

దానిశాఖల కొనలకుబోయి చూచెను. భార్యబారెడు దూరములోనున్నది. కాని యందునిలిచి చేతులు చాపిన, నందకున్నది. అప్పుడతనికి మున్నుసర్కసు లోనేర్చిన విద్యయేయాధారముగాదొచి. తనపాదములు రెండును జెట్టుకొమ్మకుదగిలించి గట్టిపట్టుచే దనదేహము నిలుపుకొని, తలక్రిందుగావ్రేలాడుతన చేతులతొ భార్యపారములం బట్టయత్నించుచు నూగులాడుచుండెను. ఆచెట్టు వ్రేళ్లుగ్ల తావు గుల్లనేల యగుటచేత, బరువుగల మానిసియొక్కడు దాని గొమ్మలంబట్టివ్రేలుట చేత, నది క్రమముగా వంగి, దాని వ్రేళ్లు తెగి పోవుచుండెను. మఱిమూడునాలు గూపులలో నతడు గంగమ్మ యడుగుల నందికొన గల్గెను. ఇప్పుడు తరువున కిరువురి భారము గలుగుటచే మూలములు పూర్తిగా విచ్చేదనమందెను. ఇద్దఱు నేటగూలుదురవస్ద గలుగవచ్చునని యప్పసామి భయపడి భార్యను బ్రవాహపు టొడ్డుననుండు నిసుక తిన్నెల మీదికి విసరివైచెను. ఆమెయు సాముగరిడీల నేర్చినదేగావున, నాపతనమునందు గొప్పదెబ్బలు తగులకుండ నేలబడెను. అంత జెట్టుతోబాటు మన కధానాయకుడును ప్రవాహములో బడిపోయెను. అతడుపడినచోట నొకరాతిగుట్ట నీళ్ళలోమునిగి యుండెను. దానిపై నాతడువ్వెత్తుగా బడుటచే నతని శిరస్సు పగిలెను. శరీరభాగములలో మఱికొన్నిటికిని గట్టిదెబ్బలు తగిలెను. తలదమ్ము ఘటించుటచే నప్పలసామి కొంతవడి మేనేమఱచి యుండెను. ఆవల గొంత