ఈ పుటను అచ్చుదిద్దలేదు

167

నిధనము.

నాడుదొడగికొని వచ్చుటచే, నతడు తన నాధుడేయని నిశ్చయించి, వేగముగా నాతనికడకు బోవలెనను కుతూహలముచేత దానెక్కిన కొండచరియ యందు బరువిడుచు గ్రిందికి దిగ జొచ్చెను. ఆసరువున నామెకును గాలు జాఱెను. తూలిపడెను. ఆమె పడిన చొటించుక సమముగానుంటచే నామె క్రిందికి జాఱిపోవు చుండెను. పట్టుకొనుటకాధారమేమియు నామెకు లభింపకుండెను. రెండునిముసములట్లు జాఱుచున్న, నామె తప్పక క్రింది లోయలోని యేటబడును. తుదకామె కొక పాషాణశృంగ మవలంబముగా దొరికి దానిం బట్టి వ్రేలాడుచుండెను. కాని యామెపై కెగబ్రాకుట కేమియు వీలులేకుండెను. ఇట్టులుండి యామె తనవనుకతట్టుననున్న కొండచరియమీద బడి యున్న భర్తనుద్దేశించి, "నాధా! నేనీయేట బడబోవు చున్నాను. నాప్రాణరక్షణముం జేయవా? ఆయాసముచే బట్టుదప్పుచున్న" దని కేకలిడెను.

     వెన్నెలసోకుటచే నప్పలసామి మూర్చనుండి తేఱుకొనెను. అతడా యార్తనాదమువిని లేచిచూడ నెదుటనున్న కొండమీద నొక ఱాతికొనను బట్టుకొని వ్రేలాడుచున్న తనభార్యగాన్పించెను. అతడామెను గాపాడనామాననాయని యించుక తర్కించుకొని, యవల నెట్టివారలైనను నార్రిజెంది రక్షణము గోరునప్పుడు రక్షణంబొందు నర్హులెయని తలచి భార్యను గాననిశ్చయించుకొని, తనదగ్గఱనున్న చెట్టు మీదుగాబోయి, దాదాపుగా నావలికొండ నంటియుండు