ఈ పుటను అచ్చుదిద్దలేదు

165

నిధనము.

బోవజొచ్చెను. "నేను మిమ్మనుగమనించుదాననే" యనుచు గంగమ్మయు నాతనివెంటబడి బరుగిడెను.

19. నిధనము

-)0(-

      అప్పలసామి చంగుచంగున దుముకుచు బొలముల వెంబడి బరువెత్తి యొకయేటిలోదిగి నవలీల నీది యావలనున్న కొండనెక్కి, వేగముగా బోవుచుండెను. అతనికి గమ్యస్దాన నిర్ణయములేదు. పోవుటకొఱకే పోవుచుండెను. గంగమ్మ యాతని ననుసరించి యేటిదాక బరుగెత్తగల్గెను. కాని యామె కీతరాదు. గనుక నీటిలోదిగి ముందునకు బోలేక, యేటిగట్టువెంబడిని గొండకావలిప్రక్కకు ద్వరితగతిని బోవుచుండెను. మనస్సు చలించి యొక్కమచ్చుననే పరుగిడు నప్పలసామి కొండకొన జేరినతర్వాత నడుగులు తడబడుటచే జాఱిపడెను. ఆపాటుచే నతడు మూర్చిల్లి రాలపై దొరలిపోవుచు నడుమనొక భూరివృక్షమడ్డురాగా దానిచే నాపబడి యుండెను. అతనికి జైతన్యమేలేదు. దేహమంతయు గాయము లయ్యెను. మనస్సులోనిగాయము చెప్పనక్కఱయే లేదు కదా! ఏటిగట్టున బరుగులిడు గంగమ్మ మఱియొక కొండనారోహించి భర్తకై వెదకుచుండెను. "నాధా! నాప్రాణనాధా!" యని పేరెలుంగున బిలుచుచు నామెపోవుచుండెను.