ఈ పుటను అచ్చుదిద్దలేదు

163

ఆశ్లేషము.

దేవుడేసాక్షిగా నున్నాడనియెంచి, వెంటనేచెప్పుము. ఆశిశువునకు నీకునుగల సంబంధమేమి?

    గంగ--(తమలత వడకుచుండ నిలిచియున్నది, యొక్కపాటున మగనిపాడములపైవ్రాలి) ప్రాణేశ్వరా! మహాపాపాత్మురాలనగు నేనింకను దాపగలనా? ఆబిడ్డ నేనుగన్నకూన, దానిపైగల మోహముచే నేనుమీయాజ్ఞ నతిక్రమించి  యిటకు వచ్చుచున్నాను. కదుపుదీపిని ద్రోయజాలకయు దమయానతి దాటజాలకయు నాపడుతాప మాయీశ్వరునికే యెఱుక. గ్రుక్కెడు ప్రాణములేకదా, యేలవిడువరాదని యూహించితిని. కాని నేను మృతినొందిన, నాబిడ్డగతి యేమగునోయని సంకొచించి యాప్రయత్నము మానితిని. రూపొందిన నాపాపముం దమకు జూపుట యధిలతాపహేతువని యందునకు సాహసింపనైతిని. నాగుట్టు బట్టబయలయ్యెను. గనుక, నెనికజీవింపరాదు.నన్ను మీచేతులతో జంపి యీపిల్లనుమాత్రము గాపాడుడు నాయాత్మకు శాంతిగలుగును.
      అప్ప--ఇప్పుడు శిక్షింపవలసిన పనేమియు లేదు. పుత్త్రికామోహముచే నీవొనరించిన యీరహస్య చర్య యంత గానింద్యముగాదు. బుద్ధిపూర్వకముగా నీవుచేసిన ఘోరపాపమునకై నీవు పశ్చాత్తాపపడుట కును వలనుగాకుండ, నీకాబిడ్డయడ్డంకియైనది. అంతేకాక యది నీదురతములను బెరుగ