ఈ పుటను అచ్చుదిద్దలేదు
10

గోపదంపతులు.

     పోలీసులైన్సు దగ్గఱ నొకచిన్న పెంకుటిల్లు గలదు. అందొక స్త్రీ ముప్పదైదేండ్ల యీడుగలది, నవయౌవనవతియగు కూతుతో గాపురము చేయుచున్నది. ఆయాడుదానిమగడు దుష్టుల సావాసము జేసి దుర్నీతిపరుడై పెద్దలార్జించిన ధనమంతయు వ్యయమొనర్చి కట్టుబుట్టమును గుడువగూడునులేని యవస్దను దెచ్చుకొని గృహధనముతోబాటారోగ్యధనము సితము గోల్పోయి దుర్భరమైన క్షయవ్యాధికిలొనై మృతినొందెను. భర్తగతింపగా నాయిల్లాలి కేదారిలేక మానముచంపుకొని గోడేవరునుజమీందారులయింట దాస్యమొనరించుచు గూతుని బెట్టుకొని యాయింటనొకభగ మద్దెకుబుచ్చుకొని కాపురముండెను. ఆకూతురే మ్నకధానాయికయగు గంగమ్మ. మనకధానాయకుడగు నప్పలస్వామి కండలుగట్టిన భుజదండములతో విశాలమగు ఱొమ్ముతో నామెయింటిప్రక్కనుండి పోవునపుడు గంగమ్మ పెక్కుసారులు చూచి యట్టిబలాధ్యుని వివాహమాడు భాగ్యము గల్గునాయని యూహించుచుండెను. గంగమ్మకూడ బచ్చనుమేని చాయగలిది సర్వాంగ సౌష్టవముతో నొప్పుచున్న యువతీలలామయౌట, నప్పలసామియు వీధియ్రుగుపైనిల్చి తనవంక సానురాగమున జూచునామెను గాంచినప్పుడెల్ల నామెతనకర్దాంగియగు పుణ్యమబ్బునాయని తలచుచుండెను.
   ఇట్టు లాయువయువతీమణులు కొంతకాలముదాక హృదయగతాను రాగములను వెల్లడింపజాలక యన్యోన్య్సవీక్ష