ఈ పుటను అచ్చుదిద్దలేదు

159

ఆశ్లేషము.

జూచి యతడింకను గుఱ్ఱుపట్టి నిద్రించుచున్నటులే గాంచి, పెరటి గుమ్మము తెఱచి, పైనిగొండెముంబెట్టి చప్పుచప్పుంస సుందరమ్మ యింటికేగెను.

   అది కృష్ణవకైకాఅశి, పదునొకండుగంటలు దాటినను జంద్రోదయముకాలేదు. నక్షత్రములకాంతి యుండెను గాని, దానివలన జెట్లచే దట్టముగాగప్పివేయబడినబాట తిన్నగా గాన్పింపకుండెను. ఆమె హృదయములో వెలుగు ప్రేమ జ్యోతియే దేదీప్యమానములైన కాంతులను ముందు పంపుచుండగా, గంగమ్మ నిర్బయముగా నడచి పోవజొచ్చెను. ఆమె వీధిలోని కేగుటగని యప్పలసామిలేది, కఱ్ఱకత్తియొకటి చేబూని తానును జప్పుడుజేయకుండగనే వీధిలోనికి సింహద్వారముగుండ వచ్చినిలిచెను. అప్పటికి గంగమ్మ సుమారివది గజములు దూరమున బోవుచున్నది. అతడొక తాళము వీధిగుమ్మమమునకు వైచి, తానుగూడ నామె వెనువెంటనే బయలుదేఱి బాటప్రక్కలనున్న పొలాల గట్ల మీద నడుచుచు వచ్చుచుండెను. గంగమ్మ తెన్నెవ్వరేని వెంబడించుచున్నారేమోయని నడుమ నడుమ వెనుకకుదిరిగి చూచుచుండెడిది. కాని యప్పలసామి యామెకు గోచరింపకుండ నడచుటచే నామె కనిపెట్టలేకపోయెను. స్టేషన్ మాష్టరు గారి పెరటిగుమ్మము తలుపులు గంగమ్మకొఱకు రేయింబవలు తెఱువబడియే యుందునుగావున, నామె యాద్వార