ఈ పుటను అచ్చుదిద్దలేదు

157

ఆశ్లేషణము.

పోయినది. దీపపు వెలుతురులో నామెను బూర్తిగా జూచితిని. కంఠద్వని వింటిని.

     అప్ప--అలాగునా! (అనితల పంకించెను)
    రాజు--అలజడులెవ్వియు లేవుగావున, దృత్తవడితిని. పోయెదను.
    అప్ప--చిత్తము. మీదయకు మిగుల గృతజ్ఞడను.
    ఇట్టులాక్షత్రియుడొక్కఘోరవిషబీజ మాగోపుని హృదయక్షేత్రమున నాటిపోయెను. దాని విషము త్రాచు  పామువిసమువలె నిమిషములో నప్పలసామి యెడలెల్ల వ్యాపించి యతనికొక విధమైన తాపముదయింపజేసెను. ఆతాపముచే నతడు వేడి నిట్టూర్పులు పుచ్చుచుండెను. మేనెల్ల స్వేదోద్గమయ్యెను. పిచ్చియెత్తినవానివలె నతడు వాకిట  బ్రచారము చేయుచుండెను. ఏమిసేయుటకు నతనికి బాలు వోకుండెను. అతనితీరుజూచి గంగమ్మ మరల నేదో కీడు మూడినదని యనుమానపడినది. కానియట్టితఱిం దానెదుటబడుటకన్న బరొక్షమం దుండుటయే  మేలని తలంచి యామె వంటయింటనే గూరుచుండియుడెను. అంత నప్పలసామికొక యుపాయము తోచెను. అది మనస్సునకు సరిపఱుచుకొని, యతడు తాపము నించుక చల్లార్చుకొని, తాత్కాలికముగా దనకుగల్గిన భావోద్రేకము నడుంచుకొని, యెప్పటివాలకమునే పూని, నాడింట మెలంగుచుండెను. తనవెనుకటిచర్య జ్ఞప్తికివచ్చికాబోలు నతడట్టులుండెనని యూహించి గంగ