ఈ పుటను అచ్చుదిద్దలేదు

18. మాతృప్రేమ

      అప్పలసామి పొలమునకో పట్టణమునకో మఱియొకచోటికో యేగగాజూచి, గంగమ్మ ప్రతిదినము స్టేషన మాష్టరుగారి యింటికిబోయి బిడ్డనుజూచి కొంతసేపాడించివచ్చుచుండెను. బిడ్దకు జ్ఞానము వచ్చినకొలది దల్లిని దరుచుగా జూడగోరుచుండెను. దానిపొరుపడలేక సుందరమ్మ యేదాసి చేతనో గంగమ్మను రమ్మని 'కబురు ' పంపుచుండెను. దినమునకు రెండుసారులు కొన్నికొన్నిపట్ల మూడుసారులు గంగమ్మ కూతుకడకు బోవుచుండెను. అప్పలసామి యూరలేనప్పుడు బిడ్డనుదీసికొని తమిళులే గంగమ్మయింతికి వచ్చుచుండిరి. కొన్నాళ్లు రహస్యముగాబోయి రాగల్గినది. కానియవల రహస్యము దాగినదికాదు. తానెఱిగిన వారలలో నోకరు కనబడి పలుకరించుచుండువారు. వారితో నేవో యబద్ధములు పల్కి యామె పోవుచుండెను. ఎన్నాళ్ళట్టు లనృత మాడి నెగ్గుకొనిరాగలదు? ఆమెయందు జాలమంది కనుమానము గల్గి భర్తతో నామె నిత్యము స్టేషన్ మాస్టరుగారి యింటికి బోవుటను గూర్చి చెప్పుచుడిరి. అప్పలసామి కోపించి  భార్యను దిట్టుటయు నొక్కతఱి గొట్టుటయుగూడ భ్రారంభించినాడు. తనచర్య్ల బయటపడినప్పుడెల్ల నేదో  యొక సాకు గల్పించి మగనితో జెప్పి యతనిని సమాధానపెట్టజూచుచుండెను. సుందరమ్మ గంగమ్మగుణముల జెఱిచి యామెను దనమగనితో మఱియొకనికి తార్చుచున్నదనియు నప్పలసామి