ఈ పుటను అచ్చుదిద్దలేదు
148

గోపదంపతులు.

బనికై సిగ్గుపడి యామె యట్టులున్నదికాబోలునని యామెనుగూర్చి సుందరమ్మ యభిప్రాయ పడుచుండెను. కాని యది యామెభర్త యాజ్ఞవలన గలిగినదని సుందరమ్మ యెఱుగకుండెను.

     గోపదంపతులిట్టులుండ జెన్నపురిలొ సుబ్బలక్ష్మమ్మ కడనున్న శకుంతల తల్లికై బెంగగొని నానాట శుష్కించుచుండెను. ఎన్నివిధముల మఱపించినను దల్లిని మఱువకుండెను. ఎన్నివినోదములు జూపించినను దృప్తిజెందకుండెను. నిద్దురలో సైతము "అమ్మా! యెత్తో! నువ్వే బువ్వపెత్తు" అని కలవరించుచుండెను, ఆంబెంగచే బిడ్దకొకచిధమైన జ్వరముపట్టి పీడించుచుండెను. వైద్యులకాపిల్లను జూపిరి. వారాబిడ్డజబ్బునకు మందులు పనిచేయవనియు దల్లికడకు గొంపోవుటే కర్తవ్యమనియు జెప్పిరి. వారికిజేయునదిలేక తల్లి బిడ్దకొఱకిచ్చిన సొమ్ములొనే కొంతవ్యయపఱచి సుబ్బలక్ష్మమ్మను బిడ్దతో గోపాలపట్నమునకు బంపివేసిరి.
    ఒకనాటిసయంకాలమున నైదుగంటలకు సుబ్బులక్ష్మి శకుంతలనెత్తుకొని సుందరమ్మను దోడుగానుంచుకొని యప్పలసామి యింటికేగెను. అప్పటికప్పలసామి పొలములోనుండెను. కావున, వారు నిరాటంకముగా లొనికరిగిరి. చిక్కిశల్యమైయున్న కూతును జూచినతోడనే గంగమ్మ చేతులుచాచి "మాతల్లి, మాయమ్మ, మాచిట్టిశకుంతల!" యని పల్కుచు నెత్తుకొని యక్కునంజేర్చి ముద్దిడుకొనెను. బిడ్ద తల్లి