ఈ పుటను అచ్చుదిద్దలేదు
146

గోపదంపతులు.

'కవులు ' కాలము మిగియును. అప్పటికి వ్యవసాయము దభిలాషము పుట్టునేని చూచుకొందమని యతడూరకుందెను.

   ఇప్పుడప్పలసామియు గంగమ్మయు దమజీవన పధములను బూర్తిగా మార్చుకొనవలసియున్నది. సుమారు నాలుగేండ్లనుండి యలవాటుపడిన కాఫీముఖ్యములు హరంబున మానివేయుట కష్టము. ఆంధ్రభవనమునందుసైతమాతడు రుచ్యములగు హల్వాలు, షర్బత్తులు, మిఠాయిలు, తరచుగా దినిచునేయుండువాడు., రాజాన్నభోజన మొనర్చిన గంగమ్మ మ!ఱియు సున్నితములైన యాహారమున కలవడినదని వేరుగజెప్పనక్కఱలెదుగదా! కొలదిదినములదాక వారు ప్రాత;కాలమున రొట్టేలు కాఫీయు నింటియొద్దనే తయారుచేసికొని తిను చుండువారు. ఆవలనాయలవాటుకూడ దప్పించుకొని, రకరకముల జరీచీరలకును, లేసు పువ్వులచే నొప్పు వింతవింత 'జాకెట్టు ' లకును 'రిబ్బను ' లకును 'సెంటు ' లకును పౌడరులకును నలవాటు పడియున్న గంగమ్మ, యిప్పుడు 'సాదా ' నేతచీరలును గుర్తింపు రైకలును దొడిగికొనుట కారంభించెను. రిబ్బనుజడమాని వ్రేలుముడి వైచుకొనుచుండెను. విదేశసుగంధతైలములను విడిచి కొబ్బరినూనె రాచికొనుచుండెను. సబ్బుతో నొడలు తోముకొనుట మాని కుంకుడుకాయలును సీలాయలును నుపయోగించుకొనుచుండెను. చేతుల కొకజత బంగారుగాజులు, కాళ్ళ