ఈ పుటను అచ్చుదిద్దలేదు
142

గోపదంపతులు.

డెను. అప్పటికి రాత్రిజాముమీఱినది. అదివెన్నెల రేయి బిడ్దను నిదురబుచ్చి గంగమ్మ దిరిగితిరిగి యలసి యొకచోట సేదదీర్చుకొననుద్దేశించి చెంతనేయున్న యాబీచియందలి నికుంజమును జేరెను. అయ్యెడ నప్పలసామి పల్కులు వినబడ నామె యతని పాదములపైబడి హోరుహోరుననేడ్చి, "ప్రాణకాంతా! నేను మహాపరాధిని. మీకుదోచిన శిక్షనాకువిదించి మరల నన్ను బరిగ్రహింపుడు. నేనింతకాలము వెఱ్ఱియెత్తి తిరిగితిని. ఎందుంటినని నన్నడుగకుడు. భ్రష్టురాలనైతిననుట సత్య్లము. నాపాపాగ్నులు నన్ను దహించుచున్నవి. మీసదయశీతలకటాక్షములచే వానిని జల్లార్చి నన్ను గైకొనుడు. నాకు మీరేగతి." యనిపలికెను.

  అప్పలసామి యామెవిధముజూచి మిరుల జాలిపడి తానింతదనుక బ్రార్దించుచుండిన శ్రీనరసిమహ స్వామియే తన భార్యను దన చెంతకు బంపెనని తలచి యామెం గౌగిటం గ్రుచ్చియెత్తి, కొంతసేపు తాను దు:ఖించి, యవల "గంగూ! నీకోర్కెప్రకారము నిన్నేప్రశ్నము లడుకకుండగనే గైకొందును. నీతప్పులనెల్ల క్షమింతును. నీవుమాత్ర మిక నన్ను విడిచి యొక్కనిమిషముసేపైన నుండననియు, దుష్టులతో స్నేహముచేయననియు వాగ్దాన మొనర్తువేని మనము రేపే బయలుదేఱి మన గోపాలపట్టణమునకుబోయి యెప్పటి వ్యసాయ వృత్తితో సుఖజీవన మొనర్తుము" అని వచియించెను.