ఈ పుటను అచ్చుదిద్దలేదు

141

మరలుబాటు.

    బిడ్డ తెలతెలబోవుచు "అమ్మా! ఎత్తో" యని చేతులు చాపుచు మీదికి వచ్చుచుండగాగంగ్ఫమ్మ దాని నెత్తుకొని చాలసేపు దు:ఖించి, లక్ష్మమ్మ యేచో తినుబడి వస్తువులు తెచ్చియీయగా వానిని దినిపించుచు గొంతతడవుండి, యవల నొకతొట్టేలో దానిని బెట్టి, జోకొట్టి నిదురబుచ్చును. లక్ష్మమ్మ యొకటిరెండుదినములు తమ యింట నాగుమనియు, బిడ్డతనతోను దనబిడ్డలతొను మచిక పడినవెనుక నెచటికేగినను భయములేదనియు, గంగమ్మతొ జెప్ప నామె యందులకు సమ్మతించి, బిడ్డనిదురనుండి మేల్కొంచులోపల దానొకసారి భర్తకై యన్వేషించుట  యొప్పని యొక రిక్షాకుదుర్చుకొని వై.యం.సి.యే. భవనముల కేగెను. అప్పలసామిజాడ యెవ్వరెఱుగమనిరి. అతడాంధ్ర భవనములొ నున్నాడని యొకడు చెప్పగా గంగమ్మ యచటికేగెను. అచ్చటనుంది బసమార్చి వేఱొకచోట నున్నట్టు తెలియ వచ్చినది. ఆమె యాతని నెందునుగానక మరల లక్ష్మమ్మగారి యింటికివచ్చి సాయంతనమువేళల 'బీచ్ ' ప్రక్కల నాతనికై వెదక జొచ్చెను. మూడుదినములదాక నతడు కన్పట్టలెదు. మూడవనా డప్పలసామి యొక నికుంజముచెంత నాతడొక్కడేకూర్చుండి, "తండ్రీ! సింహాద్రప్పన్నా! నేనెంతకాల మిట్టురొంటనుంట? ఎన్నెన్నిటికేని నీపాదములసరకు రావించుకొందువా? నాబ్రియురాలిని మరల నాకంట బెట్టుదువా?" అని పల్కి కొనుచు గూర్చుండియుం