ఈ పుటను అచ్చుదిద్దలేదు
138

గోపదంపతులు.

    గంగ--(క్రోధరక్తిమ కన్నులలోను జెక్కుటద్దముల యందును దోప) అయ్యా! మీయింటికిని మఱియోకరి యింటికిని వచ్చి మీసుఖమున కుపయోగపడుటకు నేను బడపుగత్తెను గాను. నాకర్మగతిచే, నాబుద్ధి గడ్డితిని, నేనీతప్పుదారి బట్టి చరించితిని. నాయవిజ్ఞతకు నాహృదయమే యొక్కకతఱి నగ్ని హొత్రపుంజమై నన్ను దహించుచుండెను. అట్టులుండ మరల నీకడకురమ్మందువా? నాకాతడంపిన ధనమక్కారలేదు. ఇదివఱకే నాచరితము దురితపూరితమయ్యెనుయ్. ఇంకను నారకవహ్నిలో బడమందువా? చాలును, నీవు, నీతామ్ముడును శాశ్వతముగా సుఖింపుడు. నాకుదిండిలేకున్న బిచ్చమెత్తుకొనెదను. కాని నీవంటి పాపాత్ముని చెట్టబట్టనని నమ్ముము. ఇదే యతడిచ్చినచెక్కు చించివేయుచున్నాను. (అనుచు ముక్కలుముక్కలుగావించి వెక్కి వెక్కి యేడ్చుచు) ఓదైవమా! నేను మహాపాపాత్మురాలిని. పూతతుచరితుడైన నాభర్తను మోసపుచ్వి యిట్టిదుర్నీతిని గైకొనినందులకు నాకు దగిన శిక్షయే  గావించితివి. ఇంకను నాకుజేయదగిన శిక్ష యేదేని యున్న జేయుము. నాపాపంకమును  గడిగివేయుము.
    నటే--నీకనుభవించెడు యోగములేనప్పుడు, పరులెమిచేయగలరు? నీకర్మనీది. పొమ్ము, చిలుకకు జెప్పినట్లు చెప్పినను వినవుగా?
    గంగ--పోవయ్యా! ఇన్నియేండ్లు మీదబడియు నీకు బుద్దిరాకున్నది. చిలుకకు జెప్పినట్లు చెప్పితివా? చిలుక