ఈ పుటను అచ్చుదిద్దలేదు

16. మరలుబాటు

గంగాబాయి పలుచని పార్టీచీరగట్టి, పువ్వుల తెల్ల రవిక దొడగి, కాళ్ళకు సున్నితములైన పైజారులు ధరించి కాంచనవర్ణముగల కాశ్మీరపుసేలువు మేలిముసుగుగా వైచుకొని, మందిరమునకు నడుమనున్న 'హాలు ' లో నొకకురిచీమీద  విలాసముగా గూర్చుండియుండెను. ఆమె యిప్పుడు చాల గృశించియుండెను. సహజసౌందర్యము గలవారికి గార్శ్ల్యము కూడ నొకవింతయందముం దెచ్చును. చిక్కిపోయియు గంగాబాయి యొకవిధమగు శృంగారము నే వహించి యుండెను. కడచినరాత్రి రామయ్యచెట్టి యామెబసకు రాలేదు. కొన్నిదినములనుండి యాతనివైఖరి యించుక మాఱియుండెనని గంగమ్మ యనుమానించుచుండెను. దానికిదోడు గతరాత్రి యింటికి రాడయ్య. ఆమెకేమియు దోపక చిన్నబోయి యుండెను. తనపూర్వచరిత్రయెల్ల జ్ఞప్తికి దెచ్చుకొని తనయవివేకమునకు గుందుచుండెను. చెక్కిటజేయి జేర్చి యోజనాదృష్టితో గూరుచుండి యామె నడుమనడుమ దీర్ఘవిశ్వాసములం బుచ్చుచుండెను. 
      అట్టులుండ నటేశమువచ్చెను. ఆమెలేచి నిలువబడెను. చేటికయొకతె నటేశమునకొక కురిచీవైచెను. "గంగాబాయి! నీవుగూడ నాసీనువుగమ్ము. బొత్తుగా నీరసస్దితియందున్నావు" అని యతడు పలికెను. గంగాబాయి, "అయ్యా! నాకిప్పుడు నీరసముగాలేదు. మనస్సులో మాత్ర మాందొళన