ఈ పుటను అచ్చుదిద్దలేదు
128

గోపదంపతులు.

య్యెను. మూడవనెల గర్భంబున నామెకు జాల జబ్బు చేసెను. డాక్టరుదొరసానులు వచ్చి చికిత్సజేసిరి. కాని లాభములేకపోయెను. గర్భమునిలువక చెడిపోయెను., ఆమెమాత్రము విశేషప్రయాసముమీద బ్రదికెను, మిగుల నీరసస్దితిలోనుండి యామె బలముగలుగుటకు మందులు పుచ్చుకొనుచుండెను. ఐదాఱుమాసము లామె పద్యపానములు జాగ్రత్తగా జేయుచు మందు పుచ్చుకొనవలసియున్నది. ఇప్పట్ల మరల రామయ్య మనస్సు చలింపనారంభించెను. కాముడౌటచే మరల నవ్యకాంతుల గాంక్షించుచుండెను.

     ఇదియే తగినసమయమని యెంచి నటేశము జానకి 'ఫొటో ' పట్టుకొని రామయ్యకడకు వచ్చి, కొంత తడవేవేవో మాటలాడి, యవల ఫొటోలు వానిసొగను మున్నగు నంశములగూర్చి భాషించి కడపట దనజేబులోనున జానకిపటముం జూపి, "ఇది యెవ్వనిదో యెఱుగుదువా?" యని యడిగెను. రామయ్య యాపటమునందలి స్త్రీ సౌందర్యమున కాశ్చర్యపడి. "అన్నా! ఎవ్వరీవేశ్య? ఈమనపట్టణము ననే యున్నదా?" యని ప్రశ్నించెను. 
     నటే-- ఈమె యీపట్టణమందున్న వేశ్యయే.
   రామ--ఎక్కడున్నది? నేడు మనముదాని యింటివైపున బోవుదమా?
    నటే--వేశ్యయైనంతమాత్రమున మనకు లభించుననుకొంటివా? దాని యింటివైపున బోయినచో దాని ప్రియు