ఈ పుటను అచ్చుదిద్దలేదు
126

గోపదంపతులు.

ఆవల భర్తదుర్నీతియు నామెకు దెలిసెను. కాని యామె యభిమానము నైచ్యమున గొడిగట్టి తనయం దేతప్పు లేనిదే భర్తపాదములపైబడుట కొప్పుకొనకుండెను.

    రామయ్యతొ నట్లుసంభాషించి నటేశ మామఱునాడు తేనాంపేటకుబోయి  జానకితోను నామె తల్లితోను రామయ్య యునికినిగూర్చి సవిస్దరముగ దెలియజేసెను. తనయల్లు డారీతి నొకగొల్లదానిని జేపట్టి యిల్లు గుల్లజేసికొనుచుంట విని జానకితల్లి మిగుల దు:ఖించెను. "అమ్మా! నీయభిమాన మొకంతతడ నావలబెట్టి నీవు నీభర్తకనుకూలముగా మాటలాడుచు నతనితో గాపురము చేయకున్న బొలెడాస్తియు బొగ్గులగును. మే  మెంతాదరించినను నీకత్తింటిగౌరవము పుట్టినింట రాదని నమ్ము." మని యామె కూతునకు బోధజేసెను. కూతురును, "అమ్మా! ఇప్పుడునన్నేమిచేయమందువు?" అని తల్లినడిగెను. అప్పుడు నటేశ మడ్డుపడి యిట్లనియె. "తల్లీ! నీవునేడు నీసర్వాభరణములను దాల్చి వేశ్యకన్న మిన్నగ నలంకరించుకొని యొక, ఫొటో, తీయించుకొని నాచేతికిమ్ము. దానిం బురస్కరించు కొని నేనొకనాటకమాడి నీమగడు నీపాదములచెంతకు వచ్చునట్లు చేసెదను. నీవు నేటినుండి 'బీచ్ ' కి బ్రతిసాయంకాలమున వాహ్యాళికై వచ్చుచుండుము. నీభర్తకు నిన్నిజూప నీయ దతని కనురాగముం గల్గింతును. కొలదిదినములలో నే నాగొల్లదానిని దఱిమివేయించి నీయింటికి నిన్ను రావింతును."