ఈ పుటను అచ్చుదిద్దలేదు

119

తోటవిందు.

గూలవేయుచుండెను. తనబంట్లవలన వానింగూర్చి విని తనకట్లు సాయపడిన యాపురుషుని బహుకరింప రామయ్యరాగా నతడు గాన్పింపకుడెను. అతడెవ్వరో నెమియుంబలుకక తనదారిని దానుబొయెను.

     ఈవిందు జయప్రదముగా జరుగుటకై నటేశము కూడ జాలదొడ్పడెను. కాని యతడొకవిధమైన యీర్ష్య తొనే పనిజేసెను. రామయ్య యట్టులఖండసౌఖ్య మా గంగమ్మతొ ననుభవించుటం యతనికి గిట్టకుండెను. కొన్నాళ్ళుమాత్రమే రామయ్య గంగమ్మ ననుభవింప వలెననియు నవల నామెతనవశము కావలయు ననియు నతని సంకల్పము. అది యీడేఱునట్లు తోపక అతడీసుతో వర్తించుచుండెను. ఏదేని భేదోపాయముం బ్రయోగించి యాదంపతులను విడదీయ యత్నించు చుండెను.
        మిత్రులెల్ల జనినతర్వాత రామయ్యయు నటేశమును నొకగదిలొ గూరుచుండి యిట్లు ప్రసంగించిరి.
      నటే--తమ్ముడా! నేటివిందు బహువినోదలీల జరిగినది. కానియెక్కడనో పల్లెటూరిలోబాలమ్ముకొను గొల్లది యొక్కతె, యించుక యంగసౌష్టవముంగలిగి  దొమ్మరవిద్దెలలో నాఱితేఱి నిన్నాకర్షించుటయు, నీవు దాని వలలో బడిపోయి యదియమ్మనా డబ్బనా డెఱుగని యఖండైశ్వర్యములు నీవలన బొంది తన బిడ్డక్షేమమునకై మహారాజులొనర్చు విందు నీచేత జేయించుటయు జూడ నాశ్చర్యము