ఈ పుటను అచ్చుదిద్దలేదు

117

తోటవిందు.

ర్వవిశేషముంగూర్చియు, నతనిబిడ్డకు గల్గినయాపత్తు నుగురించియు, దాని దానినొకమహనీయుడు తప్పించుటను గూర్చియు, నాంగ్లమున నుపన్యసించి తదుత్సవాగత సభ్యులపక్షమున రామయ్యకు గృతజ్ఞతానందములర్పించుచు విందుం బ్రారంభింపజేసెను. నందనవనములో గూర్చుండి యమృతాహార మాహరించు దేవతానిచయములం బొలి యున్న యాసభ్యులెల్ల విందుగుడువనారంభించిరి. మనోహరమైన గీతములను 'గ్రామోఫొన్ ' బాడుచుండ, బైనుండి 'ఎలక్ట్రిక్ పంకాలు ' చల్లని తెమ్మెరలను వీచుచుండ,నతి రుచ్యపదార్దముల భక్షించుచు విందు లమందానందమందిరి. దొరలు మున్నగువారు పుష్టి దాయకములై తమోగుణవర్దకములగు మాంసపు వస్తువులు సారాయములు మొదలగునవి గైకొని యొడలుమఱచి నేలం బొరలదొడంగిరి. రెండవప్రక్కన గూరుచుండి యెట్టి యెట్టియాహారముం గైకొనక కేవల వినోదము కొఱకే వచ్చియున్న మనయప్పలసామి యాతీరుంగాంచి యచ్చెరువొందుచుండెను.

    విందు ముగియుటకు ముందు రామయ్యలేచి వచ్చిన వారికెల్ల వందనములర్పించి తనబిడ్డక్షేమము నకై దైవముం బ్రార్దింపుడని యందఱ నర్దించెను. అతని యుపన్యాసములో నిట్టులగూడ వచించె. "నాకూతు ప్రాణములు గాపాడిన యాపురుష పుంగవు డెవ్వడో తెలియరాకున్నది. అతని యాకారముజూడ ఘనసంఘములో జేరిన వాడనియే తొచు