ఈ పుటను అచ్చుదిద్దలేదు

109

ఆర్తరక్షణము.

స్త్రీనేరీతి విసర్జించునో యటులే స్త్రీయు దనకిష్టములేని పురుషుని విసర్జింప వచ్చుననియు, భూమిపై జన్మమెత్తినందునకు సార్దకతసౌఖ్య మొందుటగాని బానిసయై నికృష్టత యనుభవించుట గాదనియు నామె నేర్చుకొని యప్పలసామి విషయమై చింత నానాట విడిచిపెట్టెను.

   ఉదయము గంగమ్మ లేచుసరికి బైడిపత్రలో నిర్మలోదక మందిచ్చునది యొకతె, పండ్లుదోముకొనుటకు గుంచెయు బండ్లపోడియు జేతికిచ్చునది యొకతె, కూర్చుండుటకాసనమమర్చునది యొకతె, తలకు బరిమళంపు దైలము నిచ్చునది యొకతె, స్నానమునకు నీళ్ళిచ్చి యొడలుసబ్బుతో దోమి తడియార్చునది యొకతె, కట్టుటకు మేల్దుకూలములనొసంగునది యింకొకతె. కాఫీమొదలగు నాహారవస్తువుల నిడునది వేఱొకతె, ఇట్టులెందరో సేవకురాండ్రామెకు బ్రతిదిన మెన్నియో యపూర్వ భక్ష్య విశేషములదయారుచేసి బంగారు పళ్ళెరములంబెట్టి యిత్తురు. ఆమె నూత్నధవునితో నున్నపుడు తప్ప నితరసమయములం దెల్ల నామెకడిగఱ్ఱలై వర్తించు దాసీజనములు పెక్కండ్రుందురు. సాయం కాలమునం దామెచేటికలతో దద్భవనావరణమందే నిర్మింపబడియున్న ‘బాడిమింటన్ ‘ ‘టెన్నిస్ ‘ మొదలగునాటలు కొంత తడవాడి యవల ‘ఘోషాకా‘ రెక్కి వారధితీరమునకు ‘షికారు ‘గా బో